సమ్మర్ రేస్ కు పవన్‌కళ్యాణ్‌ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ మహేష్ ‘బ్రహ్మోత్సవం’ సినిమాల మధ్య పోటీ ఖాయం కావడంతో ఈసినిమాలను కొనుక్కునే బయ్యర్లు అప్పుడే ఈసినిమా నిర్మాతలతో బేరసారాలు మొదలుపెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈవిషయంలో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ నిర్మాత శరత్ మరార్ చెపుతున్న మాటలు ఈ సినిమా బయ్యర్లకు షాక్ ఇస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 

ముఖ్యంగా ‘సర్దార్’ ఓవర్సీస్ రైట్స్ కు సంబంధించి ఈసినిమా నిర్మాత మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ ఓవర్సీస్ రేట్లను పోలుస్తూ చేస్తున్న కామెంట్స్ చాలామందికి షాక్ ఇస్తున్నాయట. ఓవర్సీస్‌ మార్కెట్‌లో జయాపజయాలతో సంబంధం లేకుండా తన ఫ్లాప్‌ సినిమాలతో కూడా మిలియన్‌ డాలర్లు రాబట్టిన సత్తా మహేష్‌కు ఉంది. అయితే పవన్‌ యావరేజ్‌ సినిమాలు ఓవర్సీస్ లో మిలియన్‌ డాలర్లు సాధించలేకపోయాయి.

ఒక్క ‘అత్తారింటికి దారేది’ మాత్రం ఓవర్సీస్ లో దుమ్ము రేపింది. ఈ నేపధ్యంలో పవన్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కు మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ తో సమానంగా రేట్స్ కోట్ చేయడం చాల మందిని ఆశ్చర్య పరుస్తోంది అని టాక్. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ కాంబినేషన్ తో వస్తున్న ‘బ్రహ్మోత్సవం’ కు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కు పోలిక ఏమిటి ? అని ఓవర్సీస్ బయ్యర్లు కామెంట్స్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇలాంటి అనుకోని పరిణామానికి షాక్ అయిన ‘సర్దార్’ నిర్మాత శరత్ మరార్ ఈసినిమాకు ఓవర్సీస్ మార్కెట్లో అత్యధిక రెట్లు ఎలా రాబట్టాలి అన్న విషయమై ఈసినిమా నిర్మాణంలో పాలు పంచుకుంటున్న ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ సలహాలను తీసుకుంటున్నట్లు టాక్. అయితే ఒకేసారి కొన్ని రోజుల తేడాతో ‘బ్రహ్మోత్సవం’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లు విడుదల కావడం మన రాష్ట్రాలలోని బయ్యర్లను కూడ ఖంగారు పెడుతోంది అనే వార్తలు వినపడుతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: