తెలుగు ఇండస్ట్రీలో సూపర్ చిత్రంతో వెండి తెరకు పరిచయం అయిన అనుష్క తర్వాత వరుసగా అగ్ర హీరోల సరసన నటిస్తూ మంచి విజయాలు సాధించింది. బెంగుళూరు లో స్వతహాగా యోగా టీచర్ అయిన ఈ అమ్మడు మొదటి సినిమాతో తన ఫిట్ నెస్ బాడీతో అందరినీ ఆకర్శించింది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ ఇండస్ట్రీలో కూడా తన సత్తా చాటుంది. తెలుగు లో అరుంధతి చిత్రం తో అనుష్క స్టార్ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అప్పటి నుంచి విభిన్న తరహా పాత్రలు చేయడానికి ఇష్టపడింది.

ఇక అరుంధతి చిత్రంలో రాజసం ఉట్టి పడే పాత్రలో నటించిన ఈ అమ్మడు తర్వాత గుణశేఖర్ నిర్మించిన రుద్రమదేవి చిత్రంలో కూడా అద్భుతమైన నటన ప్రదర్శించి అందరిచేత షభాష్ అనిపించుకుంది. ఇక బాహుబలి సినిమాలో డీ గ్లామర్ పాత్రలో కూడా అద్భుతమైన నటన ప్రదర్శించింది. ఇక రేపు విడుదల కాబోతున్న ‘సైజ్ జీరో ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో అనుష్క భారీ శరీరంతో కనిపించ బోతుంది. దీనికోసం ఇప్పటికే 20 కేజీల బరువు పెరిగింది. ఇప్పుడు అనుష్క పై బాహుబలిలో నటించిన సహనటి తమన్నా తన మనసులో మాట చెప్పింది..అనుష్క సినిమా ఇండస్ట్రీకి రావడం అభిమానులు చేసుకున్న అదృష్టమని ఏ పాత్రలో అయినా ఇట్టే లీనమైపోతుందని అన్నారు.

అనుష్క, తమన్నా,రమ్యకృష్ణ


క్యారెక్టర్ కోసం అనుష్క బాగా లావైంది కానీ.. తను మాత్రం అలా చేయలేనని తెగేసి చెబుతోంది. సైజ్ జీరో సినిమా కోసం భారీగా బరువు పెరిగిన అనుష్క.. ఇప్పుడు బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉంది. ఈ వయస్సులో అలా వెయిట్ గెయిన్ అవ్వడం.. లాస్ అవ్వడం మాటలు కాదు. అది కేవలం స్వీటీ వర్క్ కమిట్ మెంట్ వల్లే సాధ్యమైదంటూ అనుష్కను తెగ పొగిడేస్తుంది ఈ మిల్కీ బ్యూటీ. ఇప్పటి వరకు అయితే అలాంటి ఛాలెంజింగ్ రోల్స్ రాలేదు. వచ్చినా భారీ సైజులోకి మారడం తనవల్ల కాదంటోంది ఈ నాజూకు భామ.


మరింత సమాచారం తెలుసుకోండి: