తెలుగు ఇండస్ట్రీలోకి మొదట హీరోయిన్స్ ఫ్రెండ్స్ గా వచ్చి తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు సంపాదించారు నటి హేమ.  తెలుగు కామెడీ యాక్టర్స్ లో ఎవరా అంటే ముందుగా గుర్తుకు వచ్చేది హేమ.  హేమ గతంలో రాజకీయ రంగంలో కూడా అడుగు పెట్టింది కానీ అది ఆమెకు అంతగా అచ్చి రాలేదు. దీంతో సినిమా ఇండస్ట్రీ బెటర్ అనుకుని ఇక్కడే కొనసాగుతుంది. అయితే ఆ మద్య మా ఎలక్షన్స్ సమయంలో తెగ హంగామా చేసిన హేమ తర్వాత మేమంతా ఒక్కటే అని చెప్పేసింది.  


బ్రహ్మానందం, హేమ కాంబినేషన్లో చాలా కామెడీ సినిమాలు వచ్చాయి. భార్యగా, చెల్లెలిగా, అక్కా,వొదిన పాత్రల వరకే చేసిన హేమ మొదటి సారిగా కుమారి 21ఎఫ్ సినిమాలో తల్లి పాత్ర వేసింది. ఈ పాత్ర మొదట తన ఇమేజ్ కి ఎక్కడ దెబ్బ పడుతుందో అని ఆలోచించినా తన సహనటులు కూడా ఇప్పటికే తల్లి పాత్రలు వేసిన వారే కాబట్టి తన కూడా ఒకే చెప్పేసింది.  

కుమారి 21ఎఫ్ సినిమా పోస్టర్

ఈ విషయం గురించి హేమ మాట్లాడుతూ..25ఏళ్లుగా తెచ్చుకున్న పేరంతా పోతుందేమోనని  ఆందోళన చెందాననితల్లి పాత్ర చేయడం ఇదే తొలిసారని, ఈ పాత్రకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందోనని భయపడ్డానని చెప్పింది.  కుమారి 21ఎఫ్  సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించడం తనకు ఎంతగానో ఆనందంగా ఉందని తెలిపింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: