సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ అనుష్క ప్రస్తుతం ఇండస్ట్రీలో హావా చూపుతుంది. ఇదిలా ఉంటే తన పెళ్ళికి సంబంధించిన వార్తలు సైతం రోజు రోజుకి జోరందుకుంటున్నాయి. ఓ ఎన్.ఆర్.ఐ తో గతంలో ప్రేమాయణం నడిపిన అనుష్క, తరవాత అతడితో డిస్టెన్స్ మెయింటెన్ చేస్తూ వస్తుంది. మళ్ళీ మరో ఎన్.ఆర్.ఐ తో అనుష్క సీక్రెట్ గా లవ్ ట్రాక్ ని నడుపుతుందని అంటున్నారు.


దీనిపై వస్తున్న వార్తలపై అనుష్క రియాక్ట్ అయింది. దీనికి సంబందించిన వివరాల్లోకి వెళితే, తను ఇంకా పెళ్లి గురించి ఇంకా ఆలోచించడం లేదంటూ అనుష్క చెప్పింది. ఇక తాజాగా తను నటించిన 'సైజ్ జీరో' సినిమా ఈ నెల 27వ తారీఖున రిలీజ్ కానుండటంతో ఈ మూవీకి సంబంధించిన రిజల్ట్ పైనే ఆసక్తి చూపుతున్నాను అంటూ చెప్పుకొచ్చింది. అయితే పెళ్లి వార్తలపై మాత్రం అనుష్క ఫుల్ క్లారిటి ఇచ్చింది. ఎప్పుడూ హీరోయిన్ అవుతానని అనుకోలేదు.


కానీ అయ్యానని అంది. అలాగే లీడ్ రోల్స్ లో చేస్తానని కూడా అనుకోలేదనీ,అయినా అలాంటి సినిమాలు చేస్తున్నాని చెప్పింది. అలాగే తాను పెళ్లి గురించి ఏమీ ఆలోచించడం లేదనీ, అయినా అది సమయం వచ్చినప్పుడు జరిగిపోతుందని అంది. అయితే ఎన్.ఆర్.ఐ తో లవ్ ట్రాక్ కి సంబందించిన వివరాలను కూడ రిపోర్టర్స్ అడిగారు.


అందుకు అనుష్క ఇలాంటివి రూమర్స్ వస్తూనే ఉంటాయి. వాటిని పట్టించుకుంటే ప్రతి విషయాన్ని పట్టించుకోవాల్సి వస్తుందని చెప్పుకొచ్చింది. దీంతో ఆ వార్తలను ఖండించకుండా, సమర్ధించటంతో అనుష్క తన లవ్ సీక్రెట్ ని ఒప్పుకున్నట్టే అని అంటున్నారు. ప్రస్తుతం అనుష్క బాహుబలి2 మూవీ కోసం కసరత్తులు చేస్తుంది. ఈ మూవీ కోసం దాదాపు రెండు నెలల కాల్షీట్స్ ని రాజమౌళికి ఇచ్చింది.



మరింత సమాచారం తెలుసుకోండి: