తమిళ ఇండస్ట్రీలో రజినీకాంత్ అంటే గొప్ప నటుడే కాదు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తిగా పేరు పొందారు. ఎన్నో గుప్త దానాలు చేసినా అవి ఏమాత్రం బయటి ప్రపంచానికి తెలియనీయకుండా ఉంచుతారని ఆయన సన్నిహితులు అంటారు. ఒక సామాన్యమైన కండెక్టర్ ఉద్యోగం నుంచి ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన సూపర్ స్టార్ రజినీకాంత్ జీవితంలో ఎన్నో సంఘటనలు జరిగాయి. ప్రముఖ వైద్యురాలు గాయత్రీ శ్రీకాంత్ .. రజినీకాంత్ పై ఓ పుస్తకం రాశారు..ఆ పుస్తకంలో ఆయన గురించి కొన్ని ఆసక్తి కర విషయాలు రాశారు.

 ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సూపర్ స్టార్  రజినీకాంత్ బెంగుళూరులోని ఒక ప్రసిద్ధ ఆలయాన్ని దర్శించడానికి వెళ్లారట , దర్శనం తర్వాత ఆయన ఆ గుడిలోని ఒక స్థంబం వద్ద కూర్చున్నారట. సాధారణంగా రజినీ బయట చాలా సింపుల్ గా ఉంటారు..తెల్ల జుట్టు నెరిసిన గడ్డం తో పంచకట్టులో ఉంటారు. స్థంబం వద్ద కూర్చున్న రజినీకాంత్ ని చూసి ఓ గుజరాత్ మహిళ ఆయనకు పదిరూపాయలు దానం చేసింది. అది చూసి రజినీకాంత్ చిరునవ్వు నవ్వాడట..అయితే అక్కడ ఉన్న ఆయన ఫ్యాన్స్ అక్కడకు చేరుకొని ఆ మహిను నిలదీశారట..ఆయన ఎవరనుకుంటాన్నావు అని ఆమెను తిట్టడం మొదలు పెట్టే సరికి ఆమె వెంటనే రజినీ వద్దకు వచ్చి క్షమించమని ఆడి ఏడ్చిందట.


తన మిత్రుడితో రజినీకాంత్


వెంటనే స్పందించిన ఆయన ఇది దేవుడు తనకు ప్రసాదించిన అసలు రూపమని చెబుతూ భగవంతుడి సన్నిదిలే ఆయనకు తెలియకుండా ఏదీ జరగదు అని ఆమెను ఓదార్చాడట. ఆమె ఇచ్చిన 10 రూపాయలకు తోడుగా మరో 10 లక్షల రూపాయలను కలిపి ఒక అనాథ శరణాలయానికి ఇచ్చాడట మన సూపర్ స్టార్. అంత గొప్ప హృదయం ఉన్న వ్యక్తి కానుకనే ఆయన సూపర్ స్టార్ రజినీకాంత్ అయ్యారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: