తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ వారుసుడిగా ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా ఇప్పటికే మంచి ఫామ్ లో ఉన్న మహేష్ ఈ సంవత్సరం వచ్చిన శ్రీమంతుడు చిత్రంతో విపరీతమైన క్రేజ్ సంపాదించారు. సోషల్ మెసేజ్ తో కూడిన శ్రీమంతుడు చిత్రం చాలా మంది మనసు దోచింది. ఇక సూపర్ స్టార్ కృష్ణ కూతురు ప్రియదర్శిని ని వివాహం చేసుకున్న సుధీర్ బాబు మంచి క్రీడాకారుడు.

ఇక సుదీర్ కూడా నటనపై ఆసక్తితో ఎస్ఎంఎస్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత వచ్చిన ‘ప్రేమకథా చిత్రం’ మంచి హిట్ అయ్యింది. తర్వాత వచ్చిన సినిమాలు అంతగా విజయం సాధించలేక పోయాయి. తాజాగా భలే మంచి రోజు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం ఆడియో వేడుకలు మొన్న ఘనంగా జరిగాయి. మహేష్ బాబు, దిల్ రాజు ముఖ్య అతిథులుగా విచ్చేయగా అదే సమయానికి బాహుబలి భల్లాల దేవ రానా కూడా వచ్చాడు..  వచ్చే రావడంతో సుదీర్ ని దగ్గరకు తీసుకున్న రానా ఒక్కసారే మహేష్ బాబు ళ్ళు మొక్కి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసాడు.

మహేష్ బాబు బ్లెసింగ్ తీసుకుంటున్న రానా చిత్రంలో గౌతమ్


కాగా మహేష్ కూర్చున్న చోటికి రానా వచ్చి కాళ్ళు పట్టుకొని విష్ చేయడంతో మహేష్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు ,అయితే తర్వాత తేరుకొని రానా ని దగ్గరకు తీసుకొని పక్క సీటు ఆఫర్ చేసాడు. వాస్తవానికి సినిమా ఇండస్ట్రీలో చాలా సినియర్ హీరో అయిన మహేష్ బాబు బ్లెసింగ్స్ తీసుకోవడం మంచిదే అనుకున్నాడో ఏమో కానీ రానా చేసిన పనికి అందరికీ ఆశ్చర్యపోయారు. బాహుబలి తో సంచలన విజయం సాధించడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు రానా.  సినిమా ఇండస్ట్రీలో ఇగో ప్రాబ్లామ్స్ ఎక్కువ ఉంటాయన్న వారికి ఇదొక్క ఉదాహారణ చాలు పెద్దలంటే ఎంత గౌరవమో నిరూపించాడున రానా.



మరింత సమాచారం తెలుసుకోండి: