ఈమధ్య చిరంజీవి తనను కలిసిన కొంతమందితో తెలుగు సినిమా రంగంలో రచయితలకు కరువు ఏర్పడిందా ? అంటూ కామెంట్స్ చేసినట్లుగా వస్తున్న వార్తలు చాలామందిని ఆశ్చర్య పరుస్తున్నాయి. గతంలో యండమూరి, సత్యానంద్, పరుచూరి బ్రదర్స్ లాంటి రచయితలు ఎందరో మంచిమoచి రచయితలు తనకు కథలు అందివ్వడంతో తాను అనేక మంచి సినిమాలలో నటించానని అటువంటి మంచి కథలు దొరకపోవడంతో తన 150వ సినిమా ఆలస్యం అవుతోంది కాని తన పొరపాటు లేదు అని చిరంజీవి తనను కలిసిన కొంతమందితో కామెంట్స్ చేసినట్లు టాక్. 

అయితే గతంలో చిరంజీవి నటించిన సినిమాలను జాగ్రత్తగా విశ్లేషిస్తే చిరంజీవి నటించిన చాల సినిమా కథలు రొటీన్ కథలతో కూడిన కమర్షియల్ సినిమాలే అన్నది వాస్తవం. అప్పుడప్పుడు భారతీయరాజ, విశ్వనాథ్, బాలచందర్, జంధ్యాల లాంటి వెరైటీ దర్శకుల సినిమాలలో చిరంజీవి నటించినా చిరంజీవికి ఎక్కువ కమర్షియల్ హిట్స్ వచ్చింది ఆరోజులలోని టాప్ కమర్షియల్ డైరెక్టర్స్ రాఘవేంద్రరావు, కోందండరామిరెడ్డిలు తీసిన సినిమాల వల్లనే అన్నది వాస్తవం. 

అయితే చిరంజీవి నటించిన 149 సినిమాలలో ప్రయోగాత్మకంగా చేసినవి జాతీయ స్థాయిలో పేరు తెచ్చిపెట్టిన సినిమాలు పెద్దగ లేకపోవడంతో చిరంజీవి కేవలం టాప్ మాస్ హీరోగా మాత్రమే టాలీవుడ్ చరిత్రలో తనకంటూ ఒక స్థానాన్ని క్రియేట్ చేసుకున్నాడు. అయితే గత 9 సంవత్సరాలుగా సినిమాలకు దూరం అయిపోయిన చిరంజీవికి సినిమా నిర్మాణ రంగంలో వచ్చిన విశేష మార్పులు అదేవిధంగా ప్రేక్షకుల అభిరుచిలో వచ్చిన మార్పులు పూర్తిగా అధ్యయనం చేయకపోవడం వల్లనే చిరంజీవి 150వ సినిమా కథ విషయంలో ఈ గందరగోళం ఏర్పడింది అని చాలామంది విశ్లేషకుల భావన.

అందువల్లనే కాబోలు ఈమధ్య కళాతపస్వి విశ్వనాథ్ మాట్లాడుతూ చిరంజీవి మెగా స్టార్ కాదని ఆయన అభిమానులు అంటూ ఇప్పుడు ఎవ్వరూలేరని అందువల్ల చిరంజీవి తన వయస్సుకు తగ్గ పాత్రలను ఎంచుకుని ప్రయత్నించాలని చిరంజీవికి సూచించాడు విశ్వనాథ్. ప్రస్తుతం టాలీవుడ్ రంగంలో మంచి కమర్షియల్ కథలు రాయగల వ్యక్తులలో పేరున్న కోన వెంకట్, ఆకుల శివ, చిన్ని కృష్ణ, పరుచూరి బ్రదర్స్ తో పాటు పూరిజగన్నాథ్ లు చెప్పిన కథలు కూడ నచ్చని పరిస్థుతులలో చిరంజీవి కోరుకునే కొత్త రచయితలు ఎక్కడ నుంచి పుట్టుకు వస్తారు అనే ప్రశ్నకు సమాధానం లేదు. అయితే చిరంజీవిని మెప్పించగల రచయిత ఎప్పటికి దొరుకుతాడో మరి చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: