టాలీవుడ్ ఎంపరర్ పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాలలో లేకపోయినా ప్రస్తుత రాజకీయాలలో అతడి స్మరణ ఎదో ఒక సందర్భంలో జరుగుతూనే ఉంది. దీనితో ఎదో ఒకరోజు పవన్ ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తాడు అన్న మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే పవన్ అడుగులు వేస్తున్నాడు. పవన్ తన అభిమానులకు ప్రజలకు దగ్గరవ్వాలనే ఓ ఛానల్‌ పెడితే బాగుంటుందనే ఆలోచనలోకి వచ్చాడు అన్న వార్తలు వస్తున్నాయి. 

దీనికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని టాక్. అయితే ప్రస్తుతం యూట్యూబ్‌ ఛానల్స్‌ బాగా పాపులర్ గా మారి యూత్ కు బాగా చేరువవుతున్న నేపధ్యంలో అటువంటి యూట్యుబ్ ఛానల్ ను ముందుగా మొదలు పెట్టి అన్నీ అనుకూలిస్తే ఒక న్యూస్ ఛానల్ దిశగా తన ఆలోచనలు కొనసాగించాలని పవన్ ఒక నిర్ణయం తీసుకున్నట్లు టాక్. దీని విషయమై తన సన్నిహితులతో చర్చలు జరుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 
 

కోలీవుడ్ లో కమల్‌హాసన్‌ తన పేరుతో ఒక యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించాడు. అందులో తనకు సంబంధించిన ప్రతి విషయాలను పెట్టి అభిమానులకు అందుబాటులో ఉండేలా చేస్తున్నాడు.  అదేవిధంగా బాలీవుడ్ స్టార్స్ చాల మంది యూట్యుబ్ ఛానల్స్ ప్రారంభించి తమ అభిమానులకు నిత్యం అందుబాటులో ఉంటున్నారు.

 ఒకప్పుడు వెబ్‌సైట్‌ లాగా ఇప్పుడు యూట్యూబ్‌ ఛానల్స్ కూడ బాగా పాపులర్ కావడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ యూట్యుబ్ ఛానల్ పై పడింది. అత్యంత తక్కువ పెట్టుబడితో యూత్ కు అందుబాటులోకి వచ్చే సాధనంగా దీనిని గుర్తిస్తున్నారు. ఒక ప్రముఖ డిజైనర్‌ పవన్ ఛానల్ డిజైన్ చేస్తున్నట్లు టాక్. ఇందులో పవన్ సినిమాకు సంబంధించిన విషయాలు సినిమాలు రాజకీయ విషయాలు ఉంటాయని తెలుస్తోంది. పవన్ ‘జనసేనను' జనం మధ్యకు తీసుకు వెళ్ళడానికి ఒక సాధనంగా ఈ ఛానల్ ను ఉపయోగించాలని పవన్ ఆలోచన..  


మరింత సమాచారం తెలుసుకోండి: