తెలుగు ఇండస్ట్రీలో కళ్యాన్ రామ్ సరసన ‘లక్ష్మీకళ్యానం’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన కాజల్ కొత్తలో ఎవరూ పట్టించుకోలేదు. తర్వాత వచ్చిన సినిమాలు అంతంతమాత్రమే నడిచినా.. మగధీర చిత్రంతో ఈ అమ్మడికి ఒక్కసారిగా స్టార్ డమ్ పెరిగిపోయింది..అప్పటి నుంచి అగ్ర హీరోల సరసన నటిస్తూ నెం. 1 పొజీషన్లోకి వచ్చింది. వెండితెరపై అడుగు పెట్టి పది సంవత్సరాలైనా ఇప్పటికీ తన అందంతో, నడవడికతో ఎప్పటికప్పుడు తనని తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంటూనే ఉంటుంది.

ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో బిజీగా ఉన్న కాజల్.. ప్రస్తుతం పవన్ కళ్యాన్  ‘సర్ధార్ గబ్బర్ సింగ్ ’ చిత్రంలో నటిస్తుంది..మరో వైపు మహేష్ బాబు బ్రహ్మోత్సవం చిత్రంలో కూడా నటిస్తుంది.  అయితే ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ చిత్రం షూటింగ్ షర వేగంగా జరుగుతుంది. మొన్నామద్య హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో కీలక దృశ్యాలు చిత్రీకరించారట. తర్వాత గుజరాత్ లో కొన్ని సీన్లు షూట్ చేసి తిరిగి హైదరాబాద్ వచ్చారు.

  1.  ‘సర్ధార్ గబ్బర్ సింగ్ ’ చిత్రంలో పవన్ కళ్యాన్


కెరీర్ లో మొదటిసారిగా పవన్ తో జోడీ కడుతున్న కాజల్ సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాలో తనని తాను పరిచయం చేసుకుంటూ ఫస్ట్ షాట్ ఇదే అంటూ ఓ పిక్ ని తన ఫేస్ బుక్ లో ట్విట్ చేసింది.   ఆ ఫోటోలో కాజల్ సంప్రదాయంగా బొట్టును పెట్టుకుని మెరూన్ కలర్ ఎథ్నిక్ వేర్, నాలుగు పేటల గొలుసుతో ముచ్చగొలిపేలా ఉంది. ఈ ఫోటోని చూస్తే ఈ సినిమాలో కాజల్ మరో సారి సంప్రదాయం పాటించే ఫ్యామిలీకి చెందిన రోల్ పోషిస్తున్నది అనిపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: