బాహుబలి సినిమాతో బాలీవుడ్లో ప్రకంపణలు తీసుకు వచ్చిన రాజమౌలి అంటే పైకి మెచ్చుకుంటున్న బాలీవుడ్ దర్శక నిర్మాతల్లో భయం ఏర్పడిందన్నది వాస్తవం. భారీ కలక్షన్స్ కలెక్ట్ చేసిన సినిమాగా బాహుబలి టాప్ సెకండ్ ప్లేస్ లో నిలిచింది. అయితే ఈ సినిమాను కరణ్ జోహార్ అక్కడ రిలీజ్ చేశాడు కాబట్టే అంత సూపర్ హిట్ అయ్యిందన్న మాట వినపడుతుంది. ఏది ఏమైనా బాహుబలి సినిమా బాలీవుడ్ హీరోల్లో కూడా వణుకు పుట్టించిన్నది నిజం. ఇప్పుదు ఆ ఫార్ములాని మన మీద ప్రయోగిస్తున్నారు బాలీవుడ్ దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలి.


ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలి తీస్తున్న సినిమా 'భాజిరావు మస్తాని'.. 120 కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణ్ వీర్, దీపికా పదుకునే, ప్రియాంకా చోప్రా లీడ్ రోల్స్ చేస్తున్నారు. సినిమా డిశెంబర్ 18న రిలీజ్ అవుతుంది. సినిమా గురించి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ట్రైలర్స్ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది. అయితే సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేసేలా చూస్తున్నారు దర్శక నిర్మాత భన్సాలీ.


తెలుగు మార్కెట్ పై కూడా ఈ సినిమా కన్ను పడ్డదంటే బాహుబలిలానే ఈ సినిమాను కూడా అంతే హైప్ క్రియేట్ చేద్దామనే ప్లాన్లో ఉన్నట్టు ఉన్నాడు భన్సాలీ. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. సినిమా తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని భావిస్తున్నారు భాజీ రావు మస్తాని దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ. అయితే తెలుగు ప్రేక్షకుల మీద ప్రేమతోనే కాకుండా ఇక్కడ మార్కెట్ మీద కూడా ఆ సినిమా ప్రభావం పడేలా చేస్తున్నాడు.


బాహుబలి సినిమా వల్ల ఒక్కసారిగా తెలుగు సినిమా స్టామినా ప్రపంచానికి తెలియచేశారు మన జక్కన్న. అందుకే ఇప్పుడు అదే ఫార్ములాతో తెలుగులో కూడా బాజీరావుని రిలీజ్ చేసి ఇక్కడ మార్కెట్ ని స్థంభింప చేయాలని భన్సాలీ ఆలోచన. అయితే తెలుగులో డబ్ అయ్యే హిందీ సినిమాలకు మన వాళ్లు అంత ప్రాముఖ్యత ఇవ్వరు చూస్తే హిందీ వర్షన్నే మల్టీ ప్లెక్స్ లో చూసి ఆనందిస్తారు తప్ప సినిమా తెలుగులో చూడటానికి ఇష్టపడరు. రీసెంట్ గా ప్రేమ్ రతన్ థన్ పాయో సినిమా తెలుగులో ప్రేమ లీలాగా రిలీజ్ అయినా పెద్దగా సక్సెస్ అయ్యింది లేదు. ఇంకా ఆ సినిమా హీరో సల్మాన్ ఖాన్ కి మెగా పవర్ స్టార్ రాం చరణ్ తెలుగు డబ్బింగ్ చెప్పడం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: