తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు హీరోయిన్లు గ్లామర్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం చూశాం..అయితే వయసు ఉన్నపుడు మంచి గ్లామర్ పాత్రల్లో నటించి బాగా డబ్బు సంపాదించుకోవాలని చూస్తున్నారు. దీనికీ ఓ కారణం ఉంది హీరోయిన్లు అన్నతర్వాత అందానికే పరిమితం అయిన రోజులు ఇవి..విపరీతమైన కాంపిటీషన్ కూడా హీరోయిన్ల మద్య ఉండటంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు.  గతంలో హీరోయిన్లు అంటే నటన, హావభావాలు అన్ని ఉంటేనే స్టార్ హోదా దక్కేది.

ఇప్పుడు కేవలం విరివిగా అందాల ఆరబోత చేస్తేనే మంచి ఫామ్ లోకి వస్తున్నామన్న అభిప్రాయం ఉంది. కానీ వీటన్నింటికి భిన్నంగా తన అందమే కాదు అద్భుతమైన నటనతో కూడా ఆడియన్స్ మనసులో చోటు సంపాదించుకోవచ్చు అంటుంది అనుష్క. మొదట్లో గ్లామర్ ప్రాధాన్యత ఉన్న సీనిమాల్లో నటించినప్పటికీ కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చి అరుంధతి చిత్రంతో అనుష్క ప్రయోగాత్మక చిత్రాల్లో చేయడం మొదలు పెట్టింది. ఇప్పటికే పంచాక్షరిలో అమ్మవారి భక్తురాలుగా.. రుద్రమదేవి చిత్రంలో మహరాణిగా.. బాహుబలి చిత్రంలో ప్రభాస్ తల్లి పాత్ర డీ గ్లామర్ పాత్రలో నటించి మెప్పించింది.

తాజాగా విడుదలైన సైజ్ జీరో చిత్రంలో బాగా లావుగా ఉన్న ఓ మహిళ తన బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నించింది.. ఫిట్ నెస్ కోసం పోతున్న మహిళలకు జరుగుతున్న అన్యాయం..ఫిట్ సెంటర్లో జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేసే మహిళగా అద్భుతమైన నటన ప్రదర్శించింది. ఈ సినిమాలో ఓ పాటలో 9 మంది స్టార్స్ కనిపించి కనువిందు చేశారు. అందులో ఒకరు రకూల్ ప్రితి సింగ్. ఇక సైజ్ జీరో చిత్రం చూసిన తర్వాత రకూల్ , అనుష్క నటన చూసి పిచ్చెక్కిపోయిందట.

సైజ్ జీరో పోస్టర్


అంత గ్లామర్ గా ఉండే హీరోయిన్ అలాంటి పాత్రలో చేసి విమర్శకుల చే ప్రశంసలు అందుకోవడం పై చాలా ఇంప్రెస్ అయ్యిందట. అంతే కాదు అనుష్క తో ప్రేమలో పడ్డానంటూ , స్వీటీ తన నటనతో నా మనసు దోచుకుందని  ట్విట్ చేసింది ఈ అమ్మడు. విభిన్న కథాంశంతో విలక్షణ  పాత్రలో స్వీటీ చాలా బాగా నటించారని పొగడ్తల్లో ముంచెత్తింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: