కుటుంబ కథా చిత్రాల్లో నటించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మాన్లీ స్టార్ శ్రీకాంత్. చేసినవి కుటుంబకథా చిత్రాలే అయినా సూపర్ డూపర్ హిట్లు తన ఖాతాలో వేసుకున్నాడీ హీరో.. కెరియర్లో తనకు మాత్రమే సాధ్యపడే.. తనవే అని చెప్పుకునే అద్భుతమైన సినిమాలు చేసిన శ్రీకాంత్ ఇప్పటికీ అదే కుటుంబ కథలనే కాస్త కామెడీ యాడ్ చేసి తీస్తున్నాడు. అయితే ఈమధ్య సినిమాలేవి ఆశించినంత సక్సెస్ కాకపోవడంతో తను కూడా మల్టీస్టారర్ అంటూ చేస్తున్నాడు.


గోవిందుడు అందరివాడేలే సినిమాలో చెర్రి పక్కన బాబాయ్ గా నటించి అలరించిన హీరో శ్రీకాంత్ ఇప్పుడు తన పంథా మార్చుకుని హర్రర్ కామెడీ సినిమా చేస్తున్నాడట. ప్రస్తుతం ట్రెండ్ మీదున్న ఈ సినిమాలపై తన కన్ను పడ్డదనుకుంట అందుకే శ్రీకాంత్ కూడా అలాంటి సినిమాలకే మొగ్గుచూపుతున్నాడు. కెరియర్లో సెంచరీ సినిమాలను కొట్టిన ఈ హీరో ప్రస్తుతం చేసిన సినిమాలన్ని ఫ్లాప్ అవ్వడంతో రూట్ మార్చుకుని హర్రర్ కామెడీ అంటూ చేస్తున్నాడట.


అమ్మా రాజశేఖర్ డైరక్షన్లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం కానిచ్చేసి అంతా అయ్యాక ప్రెస్ మీట్ పెట్టి షాక్ ఇచ్చారు చిత్ర యూనిట్. ప్రేక్షకులు తమ అభిరుచిని మార్చుకున్నారు వారి అభిరుచికి తగ్గట్టే సినిమాలు తీయాలి ఈమధ్య హర్రర్ కామెడీ జానర్లో సినిమాలు సక్సెస్ సాధిస్తున్నాయి అందుకే ఆ కథాంశంతోనే తాను ఒక సినిమా తీశానని చెప్పుకొచ్చాడు శ్రీకాంత్. కెరియర్లో అడపా దడపా వేరే హీరోల సినిమాల్లో కూడా నటిస్తూ బండిని లాక్కొస్తున్న శ్రీకాంత్ తన కొడుకుని స్టార్ ని చేసే పనిలో పడ్డాడు.


ఇప్పటికే రోషన్ ని రుద్రమదేవి సినిమాతో ఇంట్రడ్యూస్ చేయించాడు కూడా.. అదేగాకా ఓ బాలల చిత్రంలో కూడా నటిస్తున్నాడని అంటున్నారు. మొత్తానికి కెరియర్లో తాను సక్సెస్ అవ్వడానికి కొత్త మార్గం ఎంచుకుని తన స్టార్డం తగ్గకముందే తన కొడుకుని కూడా ముందు చూపుతోనే తెరంగేట్రం చేయించాడు శ్రీకాంత్. మరి శ్రీకాంత్ తీసుకున్న ఈ సడెన్ డెశిషన్స్ తో కెరియర్లో ఎలాంటి సినిమాలు చేయనున్నాడో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: