సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు ఏం చేసినా అదొక పెద్ద న్యూస్..ఈ మద్య కాలంలో అయితే ట్విట్టర్లు, ఫేస్ బుక్ లతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. బాలీవుడ్ లో బాలనటిగా ఎంట్రీ ఇచ్చి తర్వాత హీరోయిన్ అగ్ర నటులతో నటించిన హాట్ బ్యూటీ హన్సిక. తాజాగా ఈ అమ్మడు కన్నీరు పెట్టింది అదేదో తనకు కావాల్సిన వారికి కష్టమొచ్చి కాదు..సినిమాలు ఫెలయ్యీ కాదు. 



హన్సికకు  ఏం కష్టమొచ్చిందని  కన్నీరు పెట్టిందని అనుకుంటున్నారా..? అబ్బే ఏం లేదండీ  రక్త పరీక్ష కోసం రక్తం నమూనాలు తీసుకున్నందుకట.తను ఆరోగ్యంగానే ఉన్నానని.. ఎవరూ కంగారు పడకండంటూ ట్వీట్ కూడా చేసింది హన్సిక. కామన్ గా తన ఆరోగ్య పరీక్ష కోసం ఆసుపత్రికి వెళ్లిన ఈ అమ్మడు  బ్లడ్ టెస్ట్ కోసం శాంపిల్స్ తీస్తుంటే నొప్పితో కన్నీరు పెట్టుకుందట.


హన్సిక 


ఈ విషయం తెలిసిన సన్నిహితులు, అభిమానులు తెగ ఆందోళన పడిపోయారు. ఏం జరిగిందంటూ ట్వీట్లు చేశారు. అయితే నార్మల్ చెకప్ లో భాగంగానే టెస్టు చేయించుకున్నానని ..తాను ఆరోగ్యంగా ఉన్నానని హన్సిక ట్వీట్ చేయడంతో వారంతా ఊరట చెందారు. 

హన్సిక ట్విట్టర్ : 

మరింత సమాచారం తెలుసుకోండి: