చెట్టు పచ్చగా ఉంటే..పక్షులు వాలుతాయి..మనుషులు ఆ చెట్టుకిందే సేద తీరుతారు.. ఒకవేళ చెట్టు మోడువారితే..పక్షులు రావు..మనుషులూ వెళ్లరు... ఇది జగమెరిగిన సత్యం. ఇక సినిమా ఇండస్ట్రీలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. రెండు సినిమాలు వరుసగా హిట్ కొడితే..స్టార్ దర్శకుడిగా ఎదిగిపోతారు. అదే స్టార్ దర్శకుడు భారీ చిత్రాలు రెండు వరుసగా ఫ్లాప్ అయితే. ఫ్లాప్ దర్శకుడిగా మారిపోతారు. ఇది కేవలం దర్శకులకే కాదు..హీరో,హీరోయిన్లకు కూడా వర్తిస్తుంది.

గతంలో స్టార్ దర్శకుడిగా పేరుతెచ్చుకున్న శ్రీనువైట్ల ఈ మద్య వరుసగా రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో అందరి దృష్టిలో ఫ్లాప్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు..గతంలో ఈయన తీసిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయినవే.. హీరోలకు ఒక్కసారిగా స్టార్ డమ్ తెచ్చినవే.. బ్యాడ్ లక్ ఎంటంటే..ఆయన వరుసగా మహేష్ బాబు తీసిన ‘ఆగడు’, రాంచరణ్ ‘బ్రూస్ లీ’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పొందాయి.  శ్రీను వైట్ల దర్శకత్వంలో నటించడానికి  టాప్ హీరోలంతా తమకు ఎప్పుడు చాన్స్ వస్తుందా అని చూసే వారు ఇప్పుడు శ్రీను వైట్ల దగ్గరకు వస్తున్నాడంటే భయపడి పోతున్నారు. ఇక అప్ కమింగ్ హీరోల పరిస్థితి కూడా అదే తీరట. ఇండస్ట్రీలో హిట్లు..ఫ్లాపులు వస్తుంటాయి పోతుంటాయి..కానీ  సినిమా రంగంలో కావాల్సింది

శ్రీనువైట్ల, రూపా 


కేవలం సక్సెస్ మాత్రమే ! అందుకే ఆ సక్సెస్ శ్రీను వైట్ల దగ్గర ఉన్నప్పుడు బోలెడు మంది హీరోలు అతడి దర్శకత్వంలో నటించడానికి తహతహలాడారు రెండు పెద్ద సినిమాలు ఫ్లాప్ కావడంతో..ఎవరు కూడా దరిదాపుల్లో రానీయడం లేదు ,దానికి తోడూ ఆ మద్య ఆయన కుటుంబంలో గొడవలు రోడ్డున పడ్డాయి. పోలీస్ స్టేషన్, కోర్టూ అంటూ ఆయనకు మనశ్శాంతి లేకుండా చేశాయి..దీంతో ఈ బాధలన్నీ చెప్పుకొని ఆయన సన్నిహితుల వద్ద బోరుమన్నట్లు సమాచారం.  దీంతో పడ్డ చోటే వెతుక్కోవాలన్నట్లు ఎక్కడైతే ఫ్లాప్ టాక్ వచ్చిందో అక్కడే బ్లాక్ బస్టర్ తీయాలన్న కసితో ఉన్నారట. మరి తన తదుపరి చిత్రంలో ఏ హీరో తో చేయబోతున్నాడో వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: