ఒక డిఫరెంట్ కథని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచన వచ్చినప్పుడు సినిమా మీద కావాల్సినంత హైప్ తీసుకువచ్చే ప్రయత్నం చేసే దర్శక నిర్మాతలు ఆ తర్వాత దాన్ని ఆడియెన్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అని సినిమాకు సంబంధించిన క్లూని ఆడియెన్స్ కి వదులుతారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితే సూర్య '24' సినిమా విషయంలో జరుగుతుంది. సూర్య మూడు విభిన్న పాత్రల్లో చేస్తున్న ఈ సినిమా ఇష్క్, మనం లాంటి సినిమాలను డైరెక్ట్ చేసిన విక్రం తెరకెక్కించడం విశేషం. అయితే సినిమాకు సంబంధించిన కథ ఇదేనంటూ ఓ కథ ఫిల్మ్ నగర్లో హల్ చల్ చేస్తుంది.


సైంటిస్ట్ అయిన సూర్య ఎన్నో ప్రయోగాలు చేసి టైం మిషన్ని కనిపెడతాడు.. ఆ టైం మిషన్ తో భూత భవిష్యత్ కాలని చుట్టే క్రమంలో గతంలో తను చేసిన తప్పులను సరిద్దే ప్రయత్నం చేయడంలో వచ్చే సమస్యసలతో సినిమా చేస్తున్నాడు సూర్య. అయితే సైంటిస్ట్ గా చేస్తున్న సూర్య ఆ సైంటిస్ట్ కొడుకుగా.. ఇంకా ఆ టైం మిషన్ సొంతం చేసుకోవాలనే కుట్ర పన్నే విలన్ ఆత్రేయగా సూర్య నటించడం విశేషం. అయితే సినిమా కథ మన బాలయ్య రెండు దశాబ్ధాల క్రితం చేసిన ఆదిత్య 360లా అనిపిస్తున్నా కథనంలో కొత్తగా ఉంటుందని అంటున్నారు.


ఇక సూర్య 24 సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇప్పటికే సినిమా మీద భారీ అంచానాలు ఏర్పడేలా చేశాయి. ఇష్క్,మనం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన విక్రం ఈ సినిమాను తెలుగులో కూడా భారీ రేంజ్లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడు. తెలుగు డబ్బింగ్ రైట్స్ హీరో నితిన్ తీసుకున్నాడని ఎప్పుడో డిక్లేర్ అయ్యింది. మరి టైం మిషన్ తో నడిచే ఈ కథ ప్రేక్షకులని ఏ విధంగా ఆకట్టుకోనుందో చూడాలి. ముందు సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేద్దామని చూసినా కోలీవుడ్లో స్టార్ హీరోల సినిమాలు పోటీకి వస్తుండటంతో సమ్మర్లో రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు.


సూర్య నటిస్తూ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత, నిత్యమీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కె.యి జ్ఞావెల్ రాజా సంపర్పణలో 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్య ఈ సినిమాను నిర్మించడం విశేషం. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో మరోసారి సూర్య తెలుగులో గజిని లాంటి హిట్ కొడతాడనే నమ్మకంతో ఉన్నారు ఆయన అభిమానులు. మరి సినిమా రిలీజ్ అయితే గాని తెలియదు అసలు విషయం ఏంటో. ప్రసుతానికి లీక్ అయిన కథ పబ్లిసిటీ స్టంట్ అనే చెప్పకనే చెబుతున్నారు చిత్ర యూనిట్.


మరింత సమాచారం తెలుసుకోండి: