తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాన్ ఒక మంచి నటుడే కాదు మంచి సింగర్ గా కూడా.. తమ్ముడు, జానీ, అత్తారింటికి దారేది చిత్రాల్లో తన గొంతు వినిపించాడు. ఇక అత్తారింటికి దారేది చిత్రంలో కాటమ రాయుడా అనే పాట విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ సినిమా తర్వాత పవన్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. పవర్ సినిమా దర్శకుడు బాబీ దర్శకత్వంలో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ షరవేగంగా జరుగుతుంది. ఆ మద్య హైదరబాద్ లో రామానాయుడు స్టూడియోలో కీలక ఘట్టాలు షూట్ చేశారట.  

గతంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్ ’ సినిమాలో ఐటమ్ సాంగ్ ‘కెవ్ కేకా’ ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలుసు..ఇక సర్ధార్ సినిమాలో కూడా ఓ ఐటమ్ సాంగ్ ఉందట..ఇందులో హాట్ బ్యూటీ లక్ష్మీరాయ్ నటించిందట. మొదట పూణే లో కొంత భాగం షూట్ చేసిన తర్వాత హైదరాబాద్ లో కొంత షూట్ చేశారు. ఆ మద్య గుజరాత్ లో క్లయిమాక్స్ సీన్స్ షూట్ చేసినట్లు తెలుస్తుంది.

‘కాటమ రాయుడా’ పాట పాడుతున్న పవన్ కళ్యాన్, పక్కనే దేవీశ్రీ ప్రసాద్, దర్శకుడు త్రివిక్రమ్


ఇక ఈ సినిమా సంక్రాంతి బరిలో దింపాలని చూసినా షూటింగ్ కాస్త ఆలస్యం కావడంతో మార్చిలో రిలీజ్ చేయడానికి సిద్దమైనట్లు చిత్ర యూనిట్ తెలిపింది.  ఈ సినిమాలో మాంచి  బిట్ సాంగ్ ని కంపోజ్ చేసే పనిలో  ఉన్నాడట దేవిశ్రీ ప్రసాద్. ఆ బిట్ సాంగ్  పవన్ ఆలపిస్తే నే బాగుంటుందని భావిస్తున్నారు అయితే దానికి ఇంకా పవన్ గ్రీన్ సిగ్నల్ మాత్రం ఇవ్వలేదు. అయితే గతంలో పవన్ పాడిన పాటలకు మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో ఆయను  కన్విన్స్ చేస్తే తప్పకుండా ఒప్పుకుంటాడు కాబట్టే ఆ ప్రయత్నం చేస్తున్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: