మాస్ మహారాజ రవితేజ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘బెంగాల్ టైగర్’ తన సెన్సార్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంది. దీనితో డిసెంబర్ 10న విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఈ సినిమాలో రవితేజ తను అమితంగా ప్రేమించే తండ్రిని చంపిన విలన్స్ ని తిరిగి చంపి పగ తీర్చుకునే కొడుకుగా కనిపిస్తున్నట్లు సమాచారం. ఈసినిమా అంతా పూర్తి ఫ్యామిలీ రివేంజ్ డ్రామాగా సాగు తుందని తెలుస్తోంది. 

ఈసినిమాను చూసిన సెన్సార్ సభ్యులు రవితేజా మార్క్ తో సాగిన పూర్తి అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ అని కామెంట్ చేసినట్లు టాక్. మొత్తం సినిమాకు సంబంధించి నాలుగు చిన్న డైలాగులకు మ్యూట్ చేసి ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం ‘బాహుబలి’ లోని ఒక పాటలో తమన్నా తన అద్భుతమైన అందంతో ఎలా కనిపించిందో ఈసినిమాలో కూడ ఒక రొమాంటిక్ సాంగ్ లో ఆమె ఎక్స్ పోజింగ్ ను మాస్ ప్రేక్షకులు యూత్ కన్ను ఆర్పకుండా చూస్తారని తెలుస్తోంది. 

సంపత్ నంది అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో రవితేజ మాస్ ఎనర్జీని దృష్టిలో పెట్టుకుని క్రియేట్ చేసిన హీరో పాత్రను రవితేజ తన రొటీన్ స్టైల్ లో ఇరగ తీసాడని టాక్. తమన్నా గ్లామర్ తో పాటుగా రాశి ఖన్నా గ్లామర్ కూడ ఈసినిమాకు బోనస్ గా తోడు అవ్వడంతో అన్ని అంశాలతో కూడిన మాస్ సినిమాగా బెంగాల్ టైగర్ తయారైంది అని సెన్సార్ సభ్యులు ప్రశంసలు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 

దర్శకుడు సంపత్ నంది పవన్ కళ్యాణ్ కోసం తయారుచేసుకున్న ఈకథను కొద్దిగా మార్పులు చేసి రవితేజాతో తీసిన నేపధ్యంలో ఈసినిమా విజయం సంపత్ నందితో పాటు రవితేజాకు కూడ చాల కీలకంగా మారింది..


మరింత సమాచారం తెలుసుకోండి: