టాప్ కమెడియన్ స్థాయి నుండి బ్రహ్మానందం జారి పోతున్నాడు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో బ్రహ్మానందం తన కొడుకు రాజా గౌతమ్ ను యంగ్ హీరోగా సెటిల్ చేయడానికి తన ప్రయత్నాల వేగం పెంచాడు అన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే గౌతమ్ రెండు మూడు సినిమాలలో నటించినా రాణించని నేపధ్యంలో బ్రహ్మానందం తన కొడుకు గౌతమ్ నటించబోయే లేటెస్ట్ సినిమాకు సంబంధించి నారా రోహిత్ సహకారం తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 

గౌతమ్ ను హీరోగా పెట్టి రమేష్ దాసిన అనే నూతన దర్శకుడు ఒక వెరైటీ లవ్ స్టోరీని సినిమాగా తీయబోతున్నాడు. ఈ దర్శకుడు గౌతమ్ మీనన్ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన నేపధ్యంలో నేటి యూత్ కు నచ్చే విధంగా లవ్ స్టోరీలను ఎలా తీయాలి అన్న విషయం పై మంచి అవగాహన ఉంది అని టాక్. అయితే ప్రస్తుతం గౌతమ్ కు పెద్దగా ఇమేజ్ లేని నేపధ్యంలో ఈసినిమాలో ఒక ప్రత్యేక పాత్రను నారా రోహిత్ కోసం క్రియేట్ చేసి ఆ పాత్రను చేయడానికి రోహిత్ ను ఒప్పించారు అని టాక్. 

ప్రస్తుతం 7 సినిమాలలో నటిస్తూ చాల బిజీగా ఉన్న రోహిత్ ఈ పాత్రను ఒప్పుకోవడం వెనుక బ్రహ్మానందం హస్తం ఉంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. గత సంవత్సరం గౌతమ్ నటించిన ‘బసంతి’ సినిమాను బ్రహ్మానందం చాల శ్రద్ధ పెట్టి ప్రమోట్ చేసినా ఆ సినిమా పరాజయం చెందిన నేపధ్యంలో బ్రహ్మి ఈసినిమాను ఎదో విధంగా హిట్ చేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుస్తోంది. 

వారసుల కొడుకులు హీరోలుగా వచ్చినా నచ్చకపోతే ఘోరంగా తిరస్కరిస్తున్న ప్రస్తుత వాతావరణంలో నటుడిగా రాణించాలి అంటే గౌతమ్ చాల పెద్ద హోమ్ వర్క్ చేయాలి అని అంటున్నారు. కనీసం ఈ కొత్త దర్శకుడు అయినా బ్రహ్మి కొడుకుకు అదృష్టాన్ని ఇచ్చి ఇప్పటికే నిశ్చయించిన ‘వాడే వీడు’ టైటిల్ తో ఎలా చూపెదతాడో వచ్చే సంవత్సరం తేలుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: