తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తన అందాలతో మంత్ర ముగ్ధులను చేస్తున్న హాట్ మిల్కీబ్యూటీ తమన్నా ఇప్పుడు బిజీ హీరోయిన్ అయ్యింది. తెలుగు ఇండస్ట్రీలోకి హ్యాపీడేస్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత రచ్చ, భద్రినాథ్, కొంచెం ఇష్టం..కొంచెం కష్టం లాంటి సినిమాలతో మంచి హిట్ అందుకుంది. ఇక ఇదే ఊపుతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది..కానీ అక్కడ పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది. దీంతో తెలుగు, తమిళ ఇండస్ట్రీ బెటర్ అనుకుంది..ఇక్కడికి మకాం మార్చింది. అదృష్టం కొద్ది ఈ అమ్మడికి బాహుబలి లాంటి గొప్ప సినిమాలో ప్రభాస్ సరసన నటించే అవకాశం రావడంతో మళీ ఫామ్ లోకి వచ్చింది.  


‘బాహుబలి’ చిత్రంలో అవంతిక పాత్రలో దేవకన్యలా కనిపించింది. ఈ చిత్రంతో తమన్నాకు బాగా పాపులారిటీ వచ్చింది. ఇప్పుడు ఈ అమ్మడు ఓ తమిళ మ్యాగజైన్ పై కస్సు బుస్సు మంటుంది.  సాధారణంగా ఏ హీరో, హీరోయిన్లతో ప్రత్యక్షంగా ఇంటర్వ్యూ తీసుకుంటే వారి జీవితంలో జరిగిన సంఘటనలు..వారి ఇష్టా ఇష్టాలు, వారి పర్సనల్ లైఫ్ గురించి చర్చించి రాస్తారు. దానికి వారూ కూడా అంగీకరిస్తారు. 


కుముదం మేగజైన్ తమన్నా 


 తాజాగా కుముదం మేగజైన్ కు  తమన్నా ఎటువంటి ఇంటర్వ్యూ ఇవ్వకుండానే తన కెరీర్ కు సంబందించిన విషయాలతో పాటు వ్యక్తిగత  జీవితానికి సంబందించిన విషయాలు ,ఫుడ్ హ్యాబిట్స్ ,రెమ్యునరేషన్ తదితర విషయాలు స్పష్టంగా తమన్న చెప్పినట్లే రాశారట. దీంతో ఈ అమ్మడికి ఎక్కడో కాలింది..ఇదేంటీ తనొక సెలబ్రెటీ అని తెలియదా అలాంటిది తన అభిప్రాయం..అనుమతి లేకుండా ఎలా ఫేక్ ఇంటర్వ్యూ రాస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు రవితేజ నటించిన ‘బెంగాల్ టైగర్ ’ చిత్రంలో నటించింది..ఈ సినిమా హిట్ అయితే అమ్మడిని పట్టుకోవడం కష్టమే.. 


తమన్నా ట్విట్ : 

మరింత సమాచారం తెలుసుకోండి: