హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సదా కు ఇప్పడు అవకాశాలు కరవయ్యాయి. అయితే ఆమె తాజాగా ఓ చిత్రంలో ఐటెం సాంగ్ లో కనిపించనుంది. విశాల్ హీరోగా తమిళంలో మన్మధ గజ రాజా అనే సినిమా రూపొందుతుంది. అంజలి, వరలక్ష్మీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు సుందర్.సి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో సదా ఐటెం సాంగ్ లో నటించనున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సదా ఇప్పుడు ఈ ఐటెం సాంగ్ తో మళ్లీ అవకాశాలు దక్కించుకుంటుందని చిత్ర యూనిట్ అంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: