తెలుగు, తమిళ ఇండస్ట్రీలో లక్ తో పైకి వచ్చిన వారిలో లారెన్స్ ఒకరు. చిన్నడ్యాన్స్ మాస్టర్ గా జీవితాన్ని ఆరంభించి తర్వాత సినిమాల్లో బిజీ కొరియోగ్రాఫర్ గా ఎదిగారు. తర్వాత నటుడిగా,దర్శకుడిగా సత్తా చాటారు. తెలుగు ఇండస్ట్రీలో హర్రర్ సినిమాలంటే కేవలం దెయ్యాన్ని చూపిస్తూ థ్రిల్ చేస్తూ భయపెట్టే సన్నివేశాలే ఎక్కువగా ఉండేవి..ఇలాంటి సినిమాలు తీయడంలో రాంగోపాల్ వర్మ దిట్ట. ఇక లారెన్స్ దర్శకుడిగా ముని సినిమాతో ఆ ట్రెండ్ కి స్వస్తి పలికాడు..హర్రర్ సినిమాలో కామెడీ,యాక్షన్,థ్రిల్ మేలవించి తీయడంతో ఆ సినిమా మంచి హిట్ సాధించింది.

తర్వాత కాంచన,గంగ లాంటి సినిమాలతో హర్రర్, కామెడీ తో జనాలను విపరీతంగా ఆకర్షించగలిగాడు. స్వతహాగా డ్యాన్స్ మాస్టర్ కావడం వల్ల లారెన్స్ సినిమాలో ఖచ్చితంగా మాస్ సాంగ్ ఉంటుంది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో మంచి ఆదరణ ఉండగా ప్రస్తుతం మొట్ట శివ, కెట్ట శివ అనే సినిమా చేస్తున్నారు. దీనితో పాటు భైరవ, ముని-4-నాగ, ఓరు టిక్కెట్ల రెండు అనే సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నట్టు తెలుస్తోంది. లారెన్స్  కేవలం నటుడిగానే కాక సామాజిక వ్యక్తిత్వం ఉన్న మనిషిగా ఎన్నో సోషల్ కార్యక్రమాలను చేపడుతూ ఉన్నారు.

గంగ చిత్రంలో లారెన్స్


ఇటీవల చెన్నై వరదల వలన నష్టపోయిన వారికి కూడా తన వంతుగా కోటి రూపాయల విరాళాన్ని అందించారు లారెన్స్. ఈయనను స్ఫూర్తిగా తీసుకొని చాలా మంది నటులు ముందుకు వచ్చి చెన్నై వరద బాధితులకు సహాయం చేశారు. లారెన్స్ తాజాగా స్కూల్ చిన్నారులని కలిసి వారిని మరింత సంతోష పరిచారు. ఈ నేపధ్యంలో స్కూల్ పిల్లలు లారెన్స్‌కు చిటికెలతో వెరైటీ స్వాగతాన్ని పలికారు. లారెన్స్ కూడా వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. విద్యార్థులు దేశ భవిష్యత్ కి పునాధులు అని అందరూ మంచిగా చదువుకొని తల్లిదండ్రుల పేరు,గురువులపేరు, దేశానికి పేరు తీసుకురావాలని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: