సంచలనాల దర్శకుడు రామ్ గోపాల వర్మ ‘వంగవీటి రంగా’ లైఫ్ మూవీ పై తన ఫోకస్ పెంచాడు దీనికి సంబంధించి దాదాపుగా ఫస్ట్ లుక్‌ అనిపించే రీతిలో నిన్న వర్మ ఈసినిమాలోని రంగా పాత్రధారి ఫోటోలను ని రిలీజ్ చేశాడు. ఈ ఫోటోలలో రంగా యంగ్‌లో ఎలా వుండేవారో అచ్చం అలాగే ఈపాత్రదారి కనిపిస్తున్నాడు అంటూ రంగా అభిమానులు ఈ ఫోటోలను ఒకరికొకరు షేర్ చేసుకుంటున్నారు.  

ఈ ఫిల్మ్‌లో రంగా రాజకీయ ఎంట్రీ మొదలు ఆయన హత్య వరకు దారితీసిన పరిణామాలు ఆపై రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను క్లియర్‌గా వర్మ  వివరిస్తానని చెపుతున్నాడు. ఇప్పటికే చాలామంది రియల్ లైఫ్ స్టోరీలను తెరకెక్కించిన వర్మ మరో కొత్త కాంట్రవర్సీకి తెరలేపుతాడా ? అన్న సందేహం చాలందిలో ఉంది. అయితే ఈసినిమా ప్రస్తుత పరిస్థుతులలో తీయడం రాంగ్ టైమింగ్ అంటున్నారు విశ్లేషకులు. 

‘కమ్మ వారి మనస్తత్వం అర్ధం చేసుకునే తెలివున్న వారే అర్హత ఉన్న నిజమైన కాపులు’ అంటూ వంగవీటి రాధ చెప్పేవారని, వంగవీటి రంగా తనతో చెప్పారు అంటూ రామ్ గోపాల్ వర్మ ఈ ఫోటోలను రిలీజ్ చేస్తూ పెట్టిన కామెంట్స్ అనేక అర్ధాలకు దారితీస్తోంది. అసలే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కుల ఉద్యమాలు జరుగుతున్న నేపధ్యంలో వర్మ ఈమాట ఎందుకు విసిరాడు అన్న చర్చలు జరుగుతున్నాయి. అసలు ఈ కులo ప్రతీకను వర్మ ఎందుకు వెలుగులోకి తీసుకు వస్తున్నాడు అన్న సందేహాలు చాల మంది వ్యక్త పరుస్తున్నారు. 

వర్మ ఈమధ్య లేటెస్ట్ గా గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ జీవితం పై ‘కిల్లింగ్ వీరప్పన్’ పేరుతో సినిమాను తీసి విజయం సాధించిన నేపధ్యంలో ఆ జోష్ తో వంగవీటి రంగ జీవితం పై సినిమా తీయడానికి ప్రయత్నిస్తున్నాడు అనుకోవాలి. అయితే వీరప్పన్ పై సినిమా తీసినంత సులువుగా రంగా జీవితం పై సినిమా తీసి మెప్పించడం అంత సులువైన పని కాదని వర్మకు రానున్న రోజులలో తెలుస్తుంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా మరో సంచలనానికి వర్మ శ్రీకారం చుడుతున్నాడు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: