జబర్దస్త్ యాంకర్ రేష్మి, శ్రద్దాదాస్ లను హాట్ గా చూపిస్తూ దర్శకుడు ప్రవీణ్ సత్తార్ నిన్న విడుదల చేసిన ‘గుంటూర్ టాకీస్’ ట్రైలర్ చూసిన వారు అందరికీ టాలీవుడ్ కు మరో బూతు సినిమా రాబోతోంది అన్న సంకేతాలు వస్తున్నాయి. దీనికితోడు ఈ ట్రైలర్ ను 18 సంవత్సరాల లోపు పిల్లలు, హార్ట్ పేషంట్లు, గర్భిణీ స్త్రీలు చూడవద్దు అని ఈ ట్రైలర్ ముందు వార్నింగ్ అక్షర రూపంలో రాయడంతో ఈసినిమా బూతుతో కూడిన ఒక సస్పెన్స్ మూవీ అనే సంకేతాలను ప్రవీణ సత్తార్ తెలుగు సినిమా ప్రక్షకులకు ముందుగానే తెలియ చేస్తున్నాడు. 

నిన్న జరిగిన ఈ ట్రైలర్ లాంచింగ్ మీట్ లో నందమూరి బాలకృష్ణ మంచు లక్ష్మీలతో పాటు ఈసినిమా యూనిట్ సభ్యులు అంతా పాల్గొని తమ సినిమాను ఒక క్రైమ్ కామెడీగా ప్రమోట్ చేసుకున్నారు. గతంలో సింగీతం శ్రీనివాసరావ్ డైరక్షన్ వహించిన కమల్ హాసన్ నటించిన ‘మైకిల్ మదన కామరాజు’ స్టోరీ లైన్ లో ఈ సినిమా ఉంటుంది అని అని అంటున్నారు. 

‘చందమామ కథలు’ సినిమా తీసి అవార్డులు అందుకున్న ప్రవీణ్ సత్తార్ నుండి ఇలాంటి బూతు కామెడీ వస్తుందా అని ఆశ్చర్యపోయినట్లు టాక్.  అయితే ఈ దర్శకుడు మాత్రం ఈసినిమాను ఒక సామాజిక స్పృహతో తీసాను అని అంటున్నాడు. 

బాలీవుడ్ లో ఈమధ్య కాలంలో బూతు కామెడీ సినిమాలకు విపరీతమైన కలెక్షన్స్ వస్తున్న నేపధ్యంలో ఈ లేటెస్ట్ ట్రెండ్ ను దృష్టిలో పెట్టుకుని ప్రవీణ్ సత్తార్ ఈ ప్రయోగం చేసినట్లు అనిపిస్తోంది. మరి ప్రేక్షకులు ఈ ప్రయోగాన్ని ఎంత వరకు ఆదరిస్తారో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: