పవన్ కళ్యాణ్  రేణుదేశాయ్ లు విడిపోయినా  వారిద్దరికీ సంబంధించిన వార్తలు ఏదో విధంగా బయటకు వస్తూనే ఉన్నాయి. రేణు పవన్ నుంచి దూరమై పూణే వెళ్ళిపోయిన తరువాత నిర్మాతగా దర్శకురాలిగా మారిన విషయం తెలిసిందే. ఆమె దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇష్క్ వాలా లవ్' అనే మరాఠి చిత్రాన్ని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసేందుకు గతంలో చాలా ప్రయత్నాలు రేణు చాలా గట్టిగా చేసింది. 

అయితే ఆమె ఎంత ప్రయత్నం చేసినా రకరకాల కారణాలతో ఈ సినిమా విడుదల కాలేదు. ఈ సినిమా లో పవన్ కొడుకు అకిరా నందన్ ఒక చిన్న పాత్రను కుడా చేసాడు అనేక కారణాలతో ఇప్పటికీ విడుదల కాలేకపోయిన ఈసినిమా కోసం పవన్ రంగంలోకి దిగి సహాయం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. 

ఈ సినిమా మన తెలుగు రాష్ట్రాలలో విడుదల కాకపోయినా  ఈ సినిమా త్వరలో బుల్లి తెర పై ప్రసారం కాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన శాటిలైట్ రైట్స్ ఈటీవీ కొనుగోలు చేసిందని  రేణు దేశాయ్ తెలియ చేసింది. గతంలో ఈ సినిమా విడుదల సమయంలో తాను అనారోగ్యం పాలవ్వడం వల్ల అనుకున్న సమయానికి  తెలుగులో రిలీజ్ చేయలేక పోయాం అని చెపుతూ త్వరలో ఈ టీవీలో రాబోతోంది ఆ ప్రసార డేట్ ను  త్వరలోనే ప్రకటిస్తాం అని రేణు దేశాయ్ తెలిపింది.

అయితే సామాన్యంగా ఈటివి యాజమాన్యం అసలు విడుదలె కాని సినిమాల శాటిలైట్ హక్కులను కొనుక్కుని తమ ఛానల్ ప్రసారం చేయడు. అయితే ఈ వ్యవహారం నడవడం వెనుక పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ రేణుకి బాగా పనికివచ్చింది అని అంటున్నారు. రామోజీరావుకు పవన్ కళ్యాణ్ ఉన్న సాన్నిహిత్యంతో పవన్ స్వయంగా రంగంలోకి దిగి ఈ డీల్ సెట్ చేసాడు అని టాక్. ఏది ఎలా ఉన్నా అకిరా నందన్ ను వెండి తెర పై చూడాలి అనుకున్న పవన్ అభిమానులు త్వరలో అకిరాను బుల్లితెర పై చూడబోతున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: