అల్లుఅర్జున్ మరో కొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. బన్నీ ఫేస్ బుక్ ను లైక్ చేసిన అభిమానుల సంఖ్య అక్షరాల కోటి దాటింది. దీనితో మన దక్షిణాది సినిమా రంగంలో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి హీరోగా బన్నీ మరో రికార్డును సృస్టించాడు. 

అల్లుఅర్జున్ ఎప్పటికప్పుడు తన సినిమాల గురించే కాకుండా తన కుటుంబ సభ్యులు గురించి తన కొడుకు గురించి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తన ఫేస్ బుక్ లో పెడుతూ అభిమానులతో నిరంతరం టచ్ లో ఉండటంతో బన్నీ ఫేస్ బుక్ కు ఇన్ని లైక్స్ వచ్చాయి అనే కామెంట్స్ కూడ ఉన్నాయి. ఈ వార్తలు ఇలా ఉండగా అల్లుఅర్జున్ ప్రస్తుతం తాను నటిస్తున్న ‘సరైనోడు’ సినిమాతో మహేష్ ‘శ్రీమంతుడు’ రికార్డులను టార్గెట్ చేయాలని చాల వ్యూహాత్మకంగా ఎత్తుగడలు వేస్తున్నట్లు టాక్. 

ఈ సినిమా ఆడియో ఫంక్షన్ మార్చిలో జరిగిన తరువాత ఈ సినిమా ప్రమోషన్ కోసం బన్నీ చాల విస్తృతంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఈసినిమా పై ప్రేక్షకులలో విపరీతమైన ఆ శక్తిని పెంచడానికి చాల మాష్టర్ ప్లాన్ రచించాడని టాక్. అంతేకాదు ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ బన్నీ మన ఇరు రాష్ట్రాలలోని కొన్ని ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలకు వెళ్ళి యూత్ లో తనకు ఉన్న క్రేజ్ ను ఈసినిమా భారీ కలక్షన్స్ కోసం ఉపయోగించుకోవడానికి ఆలోచనలు చేస్తున్నాడు అని తెలుస్తోంది. 

రాబోతున్నది సమ్మర్ సీజన్ కాబట్టి పరిక్షలు అయిన తరువాత విడుదల కాబోతున్న సినిమా కావడంతో హాలీడే సీజన్ ను తన సినిమాకు భారీ కలక్షన్స్ గా మార్చుకుని కనీసం 80 కోట్ల కలక్షన్స్ టార్గెట్ ను చేరుకొని టాప్ హీరోల రేసులో మూడవ స్థానంలో నిలిచేడట్లుగా బన్నీ తనకు ఏర్పడ్డ కోటి అభిమానుల సంఖ్యను చాల వ్యూహాత్మకంగా వాడుకోబోతున్నాడని ఫిలింనగర్ టాక్. అయితే బన్నీ స్టైల్ కు విరుద్ధంగా పూర్తి మాస్ లుక్ తో వస్తున్న ‘సరైనోడు’ ఎటువంటి రిజల్ట్ ను ఇస్తుందో చూడాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: