పవన్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ మార్కెటింగ్ ను ఈ సినిమా రైట్స్ ను సొంతం చేసుకున్న ఈరోస్ సంస్థ అప్పుడే మొదలు పెట్టేసింది. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈసినిమా ఓవర్సీస్ హక్కులకోసం ఎంక్వయిరీ చేస్తున్న బయ్యర్లకు 11 కోట్ల షాకింగ్ ఫిగర్ చెప్పి అమెరికా బయ్యర్లకు ఈరోస్ షాక్ ఇస్తోంది అన్న వార్తలు వస్తున్నాయి. 

అయితే పవన్ సినిమాలకు అమెరికాలో ఉన్న క్రేజ్ ను లెక్కలోకి తీసుకున్నా ఈ ఫిగర్ చాల ఎక్కువ అన్న అభిప్రాయం ఓవర్సీస్ బయ్యర్లు వ్యక్త పరుస్తున్నట్లు టాక్. ఓవర్సీస్ మార్కెట్లో మహేష్ సినిమాలతో పోల్చుకుంటే పవన్ సినిమాలకు ఇప్పటికీ క్రేజ్ తక్కువ అని అందువల్ల ఈరోస్ సంస్థ కోట్ చేస్తున్న ఈ భారీ మొత్తం ఏ మాత్రం వర్కౌట్ కాదని ఓవర్సీస్ బయ్యర్లు గగ్గోలు పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఒకవైపు ఈరోస్ సంస్థ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ మూవీ మార్కెటింగ్ ను మొదలు పెట్టేస్తే అసలు ఈసినిమా నిజంగా ఏప్రియల్ 8న విడుదల అవుతుందా అన్న అనుమానాలు ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్నాయి. దీనికి కారణం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాలోని కొన్ని పాటల కోసం యూనిట్ విదేశాలకు వెళ్ళవలసి ఉంది. ఇంకా ఈసినిమా టాకీ పార్ట్ సంగం వరకు షూటింగ్ జరుపుకోవలసి ఉంది అన్న వార్తలు ఉన్నాయి.

 ఇవన్నీ ఎంత స్పీడ్ గా పూర్తి చేసినా ఈసినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తి చేసుకుని అనుకున్న ఏప్రియల్ 8వ తారీఖుకు విడుదల కావడం కష్టమే అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. అయితే పవన్ మాత్రం తన స్పీడ్ ను విపరీతంగా పెంచి తన యూనిట్ సభ్యులందరిచేత పరుగులు పెట్టిస్తున్నాడు అని అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: