ఈ మద్య కాలంలో సినిమా హీరోయిన్లు చాన్సుల కోసం కాస్త గ్లామర్ ప్రదర్శన ఎక్కువే చేస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ఇక బాలీవుడ్ లో అయితే అడల్ట్ కాంటెంట్ చిత్రాల్లో బీ గ్రేడ్ హీరోయిన్లు క్యూ కడుతున్నారు. ఒక్కసారి సినిమా ఇండస్ట్రీలోకి వస్తే మంచి సెలబ్రెటీలు కావడం దీంతో వారికి విపరీతంగా డిమాండ్ పెరిగిపోడం..ఎక్కడికి వెళ్లినా డిమాండ్ ఉండటంతో హీరోయిన్లు సినిమాలో గ్లామర్ పాత్రల్లో విపరీతంగా రెచ్చిపోతున్నారు.

తాజాగా యుఎస్ బేస్డ్ మలయాళీ అమ్మాయి అయిన అను ఇమానుయేల్ తాజగా తెలుగులో ''ఆక్సీజన్ '' చిత్రంలో నటిస్తోంది. గోపీచంద్ హీరో కాగా రెజీనా హీరోయిన్ అయితే అను ని రెండో హీరోయిన్ గా తీసుకున్నారు దర్శక నిర్మాతలు. ఇమానుయేల్ కాస్త సెక్సీ సెక్సీగా ఉంటుందని అందుకోసం ఈ సినిమాలో ఓ శృంగార సన్నివేశం..లిప్ లాక్ సీన్ తో మంచి మసాలా ఎలిమెంట్ జోడించాలని దర్శక,నిర్మాతలు తయారయ్యారట.

ఇంకేముంది గోపీచంద్ తో శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయి తన సత్తా చాటిందట ఈ భామ . అను గ్లామర్ ఆక్సీజన్ చిత్రానికి మరింత ఆక్సీజన్ అందిస్తుందని నమ్మకంగా ఉన్నారు ఆ చిత్ర బృందం . రొమాంటిక్ సన్నివేశాల్లో ఏమాత్రం బెరుకు లేకుండా రెచ్చిపోవడంతో తెలుగులో మంచి అవకాశాలే వస్తాయని అంటున్నారు .  



మరింత సమాచారం తెలుసుకోండి: