స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఇప్పుడు ఇండియన్ డైరెక్టర్ అయ్యాడు. ఇప్పటి వరకూ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బాలీవుడ్ డైరెక్టర్స్ హావా ఎక్కువుగా ఉంటుంది. కానీ కొంత కాలంగా ఇండస్ట్రీలో వస్తున్న మార్పులని చూస్తుంటే, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి ప్రముఖ డైరెక్టర్స్ బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ కంటే ఎక్కువుగానే పాపులారిటిని సంపాదించుకుంటున్నారు. అటువంటి వారిలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఒకరు.


2015లో వచ్చిన బాహుబలి మూవీతో ఇండియన్ బాక్స్ ఆఫీసుని షేక్ చేసి, రాజమౌళి అధ్బుతాన్నిసృష్టించాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ…ఇలా ఇతర భాషల్లోనూ బాహుబలి సత్తా చాటింది. దీంతో రాజమౌళికి ఎక్కడలేనంత పాపులారిటి వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా బాహుబలి మూవీకి సంబంధించిన ఓ ప్రత్యేకమైన డౌట్ పై రాజమౌళి వివరణ ఇచ్చుకున్నాడు. 


‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు’? అనే ప్రశ్న..బాహుబలి సినిమాని చూసిన ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఇక గూగుల్సెర్చ్ ఇంజిన్ లోనూ ప్రతి ఒక్కరూ ఈ ప్రశ్న గురించి వెతకడం ఓ పనిగా పెట్టుకోవటం మరింత విశేషం. అయితే ఈ ప్రశ్నకి సమాధానం తెలియాలంటే ‘బాహుబలి–ది కంక్లూజన్’ వచ్చే వరకూ వేచి ఉండాల్సిందే అన్ని రాజమౌళి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇక తాజాగా దీనిపై రాజమౌళి కొంత క్లారిటీని ఇచ్చుకున్నాడు. 


‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే దానికి సింగిల్ లైన్ లో సమాధానం ఉండదు. దీనికి ఓ పెద్ద స్టొరీ ఉంది. బాహుబలి కథ మొత్తం కట్టప్ప ద్రోహం మీదే తిరుగుతుందని’ రాజమౌళిచెప్పుకొచ్చాడు. అయితే రాజమౌళి చెబుతున్న ఈ పాయింట్ లో ఏ మాత్రం నిజంలేదని చిత్ర యూనిట్ నుండి వినిపిస్తున్న సమాచారం. రాజమౌళి కావాలనే ప్రేక్షకుల ఆలోచనని పక్కదారి పట్టిస్తున్నాడని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: