బాహుబలి 2’ సినిమా వార్తల పై ఇప్పుడు కేవలం టాలీవుడ్ మీడియా మాత్రమే కాకుండా బాలీవుడ్ కోలీవుడ్ మీడియాలు కూడ బాగా ఆ శక్తి కనబరుస్తూ ఉండటంతో ఈ సినిమాకు సంబంధించిన ఎదో ఒక న్యూస్ లేకుండా మీడియా లేదు. ‘బాహుబలి’ బిగినింగ్ లో శివుడి పాత్ర కోసం 130 కేజీల శరీర బరువును ప్రభాస్ పెంచుకున్న సంగతి తెలిసిందే. 

ఇప్పుడు ‘బాహుబలి 2’ లో అమరేంద్ర బాహుబలిగా ప్రభాస్ కనిపించడానికి మరో భారీ డైటింగ్ ప్లాన్ కు శ్రీకారం చుట్టాడు అన్న వార్తలు వస్తున్నాయి. ఈసినిమా షూటింగ్ ప్రారంభానికి రెండు నెలల ముందే ప్రభాస్ ఈ డైటింగ్ ప్లాన్ ను మొదలు పెట్టినట్లు బాలీవుడ్ మీడియా టాక్. ప్రభాస్ రెగ్యులర్ డైట్ లో ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే విధంగా వెజిటేరియన్ నాన్ విజిటేరియన్ ఫుడ్స్ ను మిక్స్ చేస్తూ 42 ఎగ్ వైట్స్ 250 గ్రామ్స్ చికెన్ తో పాటు ఫ్రెష్ ఫ్రూట్స్ కలిపి ఉండే విధంగా ప్రభాస్ డైటింగ్ ప్లాన్ అమలు జరుగుతోంది అని తెలుస్తోంది.

ఇంత భారీ ఆహారపు అలవాట్లను సక్రమంగా నిర్వహించడానికి ఒక ప్రత్యేకమైన డైటీషియన్ ప్రభాస్ కు నిరంతర సేవలు అందిస్తున్నట్లు టాక్. దీనికితోడు ప్రభాస్ తన వర్కౌట్ సెషన్స్ ను కూడ చాల శ్రద్ధ పెట్టి చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం ప్రతి పూట గంటన్నరకు తక్కువ కాకుండా తన ఇంటి జిమ్ లో గత రెండు నెలలుగా అమెరికా నుంచి తెప్పించిన ప్రత్యేకమైన జిమ్ ఎక్విక్ మెంట్ మధ్య ప్రభాస్ తన బాడీ వర్కౌట్స్ ను కొనసాగించినట్లు తెలుస్తోంది.

దీనికితోడు ప్రభాస్ ప్రతి పూట 15 నిమిషాలకు తక్కువ కాకుండా యోగాను చేస్తూ తన ఫేస్ లోని ఫ్రెష్ లుక్ ను కాపాడుకోవడానికి ప్రభాస్ చాల కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఇవి కాకుండా ప్రభాస్ ప్రతిరోజు 7 సార్లు బ్రౌన్ రైస్ ఓట్స్ వెజ్ సలాడ్స్ తో కూడిన ఆహారాన్ని తీసుకోవడమే కాకుండా తన వర్కౌట్స్ పూర్తి అయిన తరువాత ఒకటిన్నర స్పూన్ రెడీమేడ్ ప్రోటీన్ పౌడర్ తీసుకుంటూ రాత్రి పడుకునే ముందు సూప్ కాని మిల్క్ కాని తీసుకుంటాడు అని తెలుస్తోంది. ఇంత కష్టపడుతున్నాడు కాబట్టే ప్రభాస్ ఇమేజ్ కేవలం టాలీవుడ్ కే పరిమితం కాకుండా ప్రస్తుతం ప్రభాస్ నేషనల్ స్టార్ గా మారిపోయాడు..
 



మరింత సమాచారం తెలుసుకోండి: