తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం బాహుబలి.  అయితే ఈ సినిమాలో కట్టప్ప మాహిష్మతి సామ్రాజ్యానికి నమ్మిన బంటు..అంతే కాక అమరేంద్ర బాహుబలికి అత్యంత ఆప్తుడు అయినా కూడా చివరిలో బాహుబలిని వెనుక నుంచి పొచిచేస్తాడు..అంతే కాదు శివుడితో కత్తిపోటు కన్నా,బల్లేం పోటుకన్నా వెన్నుపోటు చాలా అపాయం అనే డైలాగ్ కొడతాడు. దీంతో వీక్షకులకు అసలు ఏంజరిగి ఉంటుందా అని బుర్రబద్దలు కొట్టుకున్నారు.. అయితే ఈ సినిమా సీక్వెల్ బాహుబలి 2 లో అసలు రహస్యం బయట పడుతుందని ఆ చిత్రం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

తాజాగా బాహుబలి సీక్వెల్‌పై మళ్లీ వార్తల హంగామా మొదలైంది. షూటింగ్ మొదలుపెట్టాక ఓ నేషనల్ మీడియాకు రాజమౌళి తొలిసారి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలు వెల్లడయ్యాయి. ఫస్ట్ పార్ట్‌లో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనేది సమాధానం దొరక్కుండా మిగిలిపోయింది.ఈ ద్రోహం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ డీటైల్స్ చెప్పాడు జక్కన్న. ఫస్ట్ పార్ట్ షూట్ చేసినప్పుడే.. సీక్వెల్‌కి సంబంధించి 30 శాతం షూటింగ్ పూర్తి చేశామని, డిసెంబర్‌లో షూటింగ్ మొదలుపెట్టి ఇప్పటిదాకా 10శాతం ఫినిష్ చేశామని వెల్లడించాడు. బాహుబలి క్లెమాక్స్ ఘట్టంలో అమరేంద్ర బాహుబలిని వెన్నుపోటుతో చంపేస్తాడు కట్టప్ప. ఈ సన్నివేశంతో తొలిభాగానికి శుభంకార్డు వేశారు దర్శకుడు రాజమౌళి.

బాహుబలి చిత్రం పోస్టర్


ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న బాహుబలి రెండోభాగంలో బాహుబలి హత్యకుగల కారణాల్ని చూపించబోతున్నారు రాజమౌళి.   రెండోభాగానికి సంబంధించిన కథ మొత్తం కట్టప్ప చేసిన నమ్మకద్రోహం చుట్టే తిరుగుతుంది. బాహుబలి హత్యకు దారితీసిన కారణాన్ని ఒక్క ముక్కలో చెప్పలేం. దానికి కథానుగుణంగా పెద్ద సెటప్ వుంటుంది. రెండోభాగంలోని ఓ భారీ ఎపిసోడ్‌లో బాహుబలి హత్యకు దారితీసిన పరిణామాల్ని ఆవిష్కరించబోతున్నాం అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: