ఏప్రిల్ ఎనిమిది న పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ డేట్ వచ్చిన దగ్గర నుంచీ పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఫుల్ ఖుషీ గా ఉన్నారు,అత్తారింటికి దారేది  ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన తరవాత పవన్ కళ్యాణ్ చేస్తున్న సోలో గా చేస్తున్న ఈ సినిమా కోసం ఫాన్స్ విపరీతమైన హైప్ తో ఎదురు చూస్తున్నారు.

 

 

 

పైగా గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ కి సీక్వెల్ కావడం తో కళ్యాణ్ ఫాన్స్ కి ఇది పండగ అనే చెప్పాలి. పైగా విడుదల డేట్ కూడా చాలా కాలం ముందరే ఇచ్చేసారు కాబట్టి అంతా హ్యాపీ అన్నమాట. ఉగాది రోజున విడుదల అవ్వబోతోంది ఈ సినిమా అంటే ఈ సినిమా విడుదల సరిగ్గా పదిరోజుల సమయంలో  వరసగా మూడు పబ్లిక్ హాలిడేస్ వస్తాయి. అంటే ఉగాదీ, శ్రీరామనవామీ, అంబేద్కర్ జయంతి రూపం లో మొదటి పది రోజులలో మూడు రోజులు ఫుల్ గా జనాలు థియేటర్ లలోకి వచ్చే ఛాన్స్ గట్టిగా ఉంది.

 

ఇవి కాకుండా సాటర్డే , సండే వీకెండ్ లు ఉండనే ఉన్నాయి. సో వేసవి కానుకగా వస్తున్న ఈ సినిమాకి మొదటి నుంచే ఫామిలీ ల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఎలా చూసినా కళ్యాణ్ ఫిక్స్ చేసిన ముహూర్తం బ్రహ్మాండంగా ఉంది అంటున్నారు అభిమానులు. ఇక బయ్యర్ లు కూడా ఈ కారణం తో ఎంత రేట్ అయినా కొని పారేస్తున్నారు సినిమాని. హిట్ టాక్ వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర కళ్యాణ్ సంచలనం సృష్టిస్తాడు అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతా బాగుండి విడుదల తేదీన సినిమా వస్తే బాగుండు.


మరింత సమాచారం తెలుసుకోండి: