రామ్ గోపాల్ వర్మ పవన్ కల్యాణ్ ను వదిలి పెట్టేలా కనిపించడం లేదు. గతవారం పవన్ కళ్యాణ్ కాపు కమ్మగా మారిపోయాడా ? అంటూ షాకింగ్ ట్విట్ పెట్టి వివాదాలకు తెర లేపిన వర్మ మళ్ళీ మరో సంచలనం చేసాడు. ఈసారి ఏకంగా పవన్ కళ్యాణ్ పై వ్యవహర శైలి పై ట్విటర్ సాక్షిగా ప్రజాభిప్రాయ సేకరణ మొదలు పెట్టాడు. 

పవన్ కళ్యాణ్ తాను స్థాపించిన ‘జనసేన’ పార్టీని మరిచిపోయి ప్రస్తుతం సినిమాలు చేస్తూ కాలం గడుపుతున్నా, వర్మ మాత్రం పవన్ కళ్యాణ్ ‘జనసేన’ స్థాపించిన నాటి స్పీచ్ ను పదేపదే గుర్తుచేస్తున్నాడు. నిజానికి ఆ రోజు పవన్ మాట్లాడింది ఒకటి, ఇప్పుడు ఆయన పయనిస్తున్న దారి మరోకటి అంటూ ఇదే పదేపదే ప్రస్తావిస్తు పవన్ ఉలిక్కి పడేలా చేస్తున్నాడు. 

ఇక లేటెస్ట్ గా పవన్ జనసేన లాంచింగ్ స్పీచ్ తరువాత అతని పయనం సంతృప్తికరంగా ఉందా లేదా అన్నదానిపై ‘ఎస్ ఆరో నో’ అంటూ ఓటింగ్ పెట్టాడు వర్మ తన ట్విట్టర్ లో. ఇప్పటికి తెలుస్తున్న సమాచారం ప్రకారం వర్మ ఈ  ట్వీట్ చేసిన ఏడు గంటల్లో 63 శాతం మంది సంతృప్తికరంగా లేదు అనే  ఓటు వేస్తే 37 శాతం మంది మాత్రం పవన్ వైఖరి సంతృప్తికరంగా ఉందని ఓటు వేసారు అని తెలుస్తోంది. 

ఈమధ్య జరిగిన ముద్రగడ కాపు రిజర్వేషన్ ఉద్యమంలో కోస్తా జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో పవన్ ఫ్లేక్సీలు, ఫోటోల పై జనం ఆగ్రహం చూపెట్టిన నేపధ్యంలో వర్మ లేటెస్ట్ గా చేస్తున్న ప్రజాభిప్రాయ సేకరణ ఫలితాలు చూస్తూ ఉంటే పవన్ పై ఇమేజ్ తగ్గిపోతోందా అని అనిపించడం సహజం. ఈ వాస్తవాలు పవన్ గుర్తిస్తాడా ? లేదంటే ఎప్పటిలాగే మౌన  ముద్ర కొనసాగిస్తాడా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్..



మరింత సమాచారం తెలుసుకోండి: