నేచురల్ స్టార్ గా ఎదిగిన నాని నటించిన ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ ఈ శుక్రువారం చాల భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఒక్క అమెరికాలోనే 175 స్క్రీన్స్ లో ఈసినిమాను విడుదల చేస్తున్నారు అంటే ఈసినిమా ఓపెనింగ్ కలెక్షన్స్ పై ఎలాంటి భారీ అంచనాలతో ఉన్నారో అర్ధం అవుతుంది. 

ఈసినిమా కథకు బాలకృష్ణకు సంబంధం లేదు అని నిన్నమొన్నటి దాక చెప్పిన నాని, మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు. నాని ఈ సినిమా ప్రమోషన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ  ఈ సినిమాలో బాలయ్య అభిమానిగా ఎలా నటించాడో చెప్పుకొచ్చాడు. సినిమాలో బాలయ్య అభిమానిగా నటించానని, స్టొరీకి దానికి ప్రోపర్‌ లింక్‌ ఉంటుందని కామెంట్ చేసాడు. 

ఈ సినిమాలో తన ఇంట్రడక్షన్‌ సీన్‌ లో ఒక సంఘటనలో ఇరుక్కుని బాలయ్య పేరు చెప్పి ఎలా బయటపడింది అన్న విషయం ఆసక్తికరంగా ఉంటుంది అని కామెంట్ చేసాడు నాని.  బాలకృష్ణ గారికి అభిమానినైతే ఎలా ఉంటానో, అలానే సినిమాలో నటించానని ఎవరినో చూసి ఇమిటేట్‌ చేయలేదని చెప్పుకొచ్చాడు నాని. 

అయితే ఈ సినిమా గురించి తెలుసుకున్న బాలకృష్ణ  బాగా ఎగ్జైట్‌ అవ్వడమే కాకుండా ‘సినిమాలో నా అభిమానిగా నటిస్తున్నావట కదా’ అని అడిగి ఈ సినిమా రిలీజ్‌ అయిన మొదటిరోజే తాను చూస్తానని తనకు మాట ఇచ్చాడని నాని చెపుతున్నాడు. అయితే ఇప్పటి దాక బాలయ్య పేరు తలవని నాని ఈ మాటలు చెప్పడం బాలయ్య ఫ్యాన్స్‌ కు జోష్ ను కలిగించి తన ఓపెనింగ్ కలెక్షన్స్ కు బోనస్ మార్చుకోవాలని నాని ఇలాంటి స్కెచ్ వేశాడా అన్న సెటైర్లు కూడ పడుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: