బాగా విభిన్న సినిమాలు తీస్తారు అని డైరెక్టర్ నరసింహ నంది కి మంచి పేరు ఉంది. ఆయన సినిమాలు 1940 లో ఒక గ్రామ, కమలతో నా ప్రయాణం , లజ్జ ఇలాంటివి అన్నీ డిఫరెంట్ గా ఎంచుకున్న కథాంశాలు. మంచి కాన్సెప్ట్ ని తీసుకుని దానికి పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే ఇవ్వడం లో ఆయన సిద్ద హస్తుడు. ఆయన సినిమా లజ్జ విడుదల కి సిద్దం అవుతూ ఉన్న సమయం లో మరొక కొత్త సినిమా చేస్తున్నట్టు ప్రకటించిన నంది ఆ సినిమా టైటిల్ కూడా విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

 

 

 

ఈ సినిమా కి టైటిల్ గా ' బుడ్డారెడ్డి పల్లి బ్రేకింగ్ న్యూస్ ' అంటూ విచిత్ర పేరు పెట్టారు ఆయన. నిన్ననే ఈ టైటిల్ ని రిజిస్ట్ర్ కూడా చేయించారు నంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పని లో ఉంది అనీ చెబుతున్నారు. ఈ సినిమా విభిన్నకథామ్సమే కానీ పూర్తి స్థాయి లో వినోదం ఉంటుంది అనీ అసలు సినిమా కాన్సెప్ట్ తెలియగానే అందరూ కచ్చితంగా షాక్ అవుతారు అనీ అంటున్నారు ఆయన. ఈ సినిమా మొత్తం ఒక 'గేదె' చుట్టూ తిరిగే విధంగా స్టోరీ - స్క్రీన్ ప్లే రాసారట ఆయన. ఈ సినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ అయ్యి మూడు నెలల్లో విడుదల అవుతుంది అంటున్నారు.

 

 

 

 

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: