యాంకర్ గా మొదలు పెట్టిన అనసూయ తన స్పీడ్ పెంచి ప్రస్తుతం సినిమాలలో నటిస్తూ టాప్ సెలెబ్రెటీగా మారిపోవాలని తన వంతు ప్రయత్నాలు చాల సీరియస్ గా చేస్తోంది అనసూయ. ఈమధ్య తాను నటిస్తున్న సినిమాలలో గ్లామర్ డోసేజ్ ను పెంచడంతో అనసూయ పై వెబ్ మీడియాలో రకరకాల కామెంట్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ కామెంట్స్ పై అనసూయ కొంచం లేట్ గా అయినా చాల ఘాటుగా స్పందించింది. 

‘ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించే బదులు మీ గురించి మీరు ఆలోచించుకుంటే జీవితంలో సక్సస్ అవుతారు’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.  అంతేకాదు తాను ఏది చేసినా తన భర్త అంగీకారంతో తమ భవిష్యత్తు గురించి ఆలోచించే చేస్తానని అంటూ రోమ్ లో ఉన్నపుడు రోమన్ లాగే ఉండాలి కదా, అలాగే తాను కూడా సినిమా పరిశ్రమలో చేస్తుందంతా తన వ్యక్తిగతం కాదు అంటూ కామెంట్స్ చేసింది. 
కేవలం తన కెరియర్ పరంగా అలా  కనిపించాల్సి వస్తుందని, ఈ విషయాన్నీ తన భర్త అర్థం చేసుకోవడం తన అదృష్టం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

అదేవిధంగా తాను చేసే పనులు నచ్చకపోతే తనను పట్టించు కోవడం మానేయండి కాని తనను కించ పరిచే  వ్యాఖ్యలు చేయద్దు అంటూ తనదైన శైలిలో తనని విమర్శించిన వారిని టార్గెట్ చేసింది అనసూయ. 

అంతేకాదు ఇటువంటి విమర్శలు ఇంకా తన పై కొంతమంది కొనసాగిస్తే అటువంటి విమర్శలు చేస్తున్న వారిని వారి తల్లి తండ్రులు సరైన పద్ధతిలో పెంచలేదనే అర్ధం వస్తుందని కామెంట్స్ చేసింది. అనసూయ ఈ వ్యాఖ్యలన్నీ తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. ఆమె కామెంట్స్ ఈరోజు వెబ్ మీడియాకు హాట్ టాపిక్..  



మరింత సమాచారం తెలుసుకోండి: