‘సర్దార్ గబ్బర్‌సింగ్’ షూటింగ్ వేగం పెరిగి దాని విడుదల తేది ఖరార్ కావడంతో ఆ సినిమాకు సంబంధించిన ఎదో ఒక సంచలన వార్త మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. ఈమధ్య కాపు సామాజిక వర్గానికి చెందిన రిజర్వేషన్ ఉద్యమం చాల తీవ్ర స్థాయిలో జరిగినప్పుడు ఆ ఉద్యమం విషయమై పవన్ సరిగ్గా స్పందించలేదు అంటూ విమర్శలు వచ్చాయి. కొందరైతే ఏకంగా కోస్తా జిల్లాలలో పవన్ ఫ్లక్సీలను తగల పెట్టిన సందర్భాలు కూడ జరిగాయి.

ఈ విషయాలు అన్నీ దృష్టిలో పెట్టుకుని పవన్ ఈ సమస్య స్పురించేలా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లో కొన్ని డైలాగ్స్ పెట్టాడు అనే ప్రచారం జరుగుతోంది. ఈ డైలాగ్స్ స్వయంగా పవన్ వ్రాసినట్లు ఫిలింనగర్ టాక్. ‘నేను కాపువాడ్ని, కాపు కాసేవాడ్ని’ అని పవన్ చెప్పే డైలాగ్ ఈ సినిమాకే హైలైట్ అని అంటున్నారు. 

అలాగే మరికొన్ని డైలాగులు కూడ ఉన్నాయని తెలుస్తోంది. డైరెక్ట్‌గా కాక‌పోయినా ఇన్ డైరెక్ట్‌గా ఈ డైలాగ్స్ తో కాపు సామాజిక వర్గాన్ని ఎట్రాక్ట్ చేసుకోవడానికి పవన్ ఈ డైలాగ్స్ ఆయుధంగా వాడుతున్నాడని టాక్.  తుని ఘటన తర్వాత ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన పవన్ చేసిన వ్యాఖ్యలు పవన్ సామాజిక్  వర్గంలోని కొంతమందికి తీవ్ర కోపం తెప్పిoచడంతో పవన్ ఈ ఎత్తుగడను వేసాడు అనుకోవాలి. అయితే ఈ డైలాగ్స్ సెన్సార్ ముందు నిలబడతాయ అన్నదే సందేహం.

ఈ వార్తలు ఇలా ఉండగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ 90 కోట్ల బిజినెస్ ను చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. సుమారు 60 బడ్జెట్ తో తీసిన ఈ సినిమాకు ఈ స్థాయిలో బిజినెస్ జరగడం టాలీవుడ్ రికార్డ్ అని అంటున్నారు. ఈ సినిమా వల్ల ఈరోస్ సంస్థకే కాకుండా పవన్ కళ్యాణ్ కు అతడి స్నేహితుడు శరత్ మరార్ కు సినిమా విడుదల కాకుండానే లాభాల పంట పండుతోందని టాలీవుడ్ విశ్లేషకుల అభిప్రాయం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: