'శివ' సినిమాతో సంచలనం రేపిన రాం గోపాల్ వర్మ ఎప్పుడూ తన సినిమాకి సంచలనాన్నే సెల్లింగ్ పాయింట్ గా తీసుకుంటాడు. జెనెరల్ గా సినిమాలో కథో, హీరో నో, కథాంశమో ఆసక్తికరంగా ఉంటాయి, వాటిని నమ్మి డిస్ట్రిబ్యూటర్ లు సినిమా కొంటారు కానీ వర్మ సినేమలా దగ్గరకి వచ్చేసరికి మాత్రం రామూ ట్రేడ్ మార్క్ కాంట్రవర్సీ లేకపోతే ఎవ్వరూ కొనే పరిస్థితి లేదు. మొన్నటి వరకూ కిల్లింగ్ వీరప్పన్ తెలుగులో తన ఆఖరి సినిమా అని ప్రకటించిన రామూ ఇప్పుడు కొత్తగా తన ' వంగవీటి ' సినిమా ఆఖరి సినిమాగా చెప్పుకొస్తున్నాడు.

 

 

 

 విజయవాడ లాంటి ఊళ్ళో ఒక రియల్ స్టోరీ జరగగా దానిని రెండు క్యాస్ట్ ల మధ్యన జరిగిన వివాదంగా వర్మ ఎలా తెరకి ఎక్కిస్తున్నాడు అనేది విశేషం. ఈ సినిమా కి ఇప్పటికే కావలసినంత పబ్లిసిటీ వచ్చేసింది. రామూ రియల్ లైఫ్ క్యారెక్టర్ లని తెర మీద అత్యద్భుతంగా చూపించగలడు అని మొన్న ఒచ్చిన కిల్లింగ్ వీరప్పన్ నిరూపించింది. రక్త చరిత్ర లాంటి సినిమా అప్పుడే రామూ ఎపిక్ డ్రామాలు ఎలా తీస్తాడు అని జనాలకి ఒక క్లారిటీ ఒచ్చింది. ఇక వంగవీటి సినిమా మీద కూడా భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి జనాలకి. ఇప్పటికే వంగవీటి రాధా లాంటి వారు ఈ సినిమా తీయద్దు అని వార్నింగ్ ఇవ్వడం తో రామూ సినిమాకి సెల్లింగ్ పాయింట్ దొరికేసినట్టు అయ్యింది.

 

 

 

మళ్ళీ ఇప్పుడు మరొక ఆసక్తికర కాంట్రవర్సీ, సెల్లింగ్ పాయింట్ తో రాబోతున్నాడు వర్మ. తెలుగు లో తను తీయబోతున్న ఆఖరి సినిమా ఇదే అంటూ రామూ ప్రకటించాడు. ఈ ఒక్క పాయింట్ ఇప్పుడు జనాలని థియేటర్ లకి మొదటి రోజునే వెళ్ళేలాగా చేస్తుంది అని చప్పచ్చు. అయితే రామూ నిజంగా ఇదే ఆఖరి సినిమా అంటాడా మళ్ళీ వీరప్పన్ లాగా ఇదికూడా కొత్త నాటకమా ?


మరింత సమాచారం తెలుసుకోండి: