తెలుగు ఇండస్ట్రీలో ‘ ఏంమాయ చేశావే’  చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ సమంత తర్వాత అగ్ర హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. గత కొంత కాలం నుంచి తమిళంలో నటిస్తున్న ఈ అమ్మడు తెలుగులో సినిమాలు తగ్గిస్తూ వచ్చింది. గత సంవత్సరం త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో నటించింది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన బ్రహ్మోత్సవం చిత్రంలో నటిస్తుంది.

సమంత నటిగానే కాకుండా యాడ్స్ లో కూడా నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదిస్తుంది. గతంలో సిద్దార్థతో ప్రేమాయణం నడిపించి వార్తల్లోకెక్కిన ఈ హాట్ బ్యూటీ తర్వాత బ్రేకప్ చెప్పడం..తర్వాత హీరోయిన్స్ పై కామెంట్ చేయడం లాంటి చేస్తూ సోషల్ మీడియాల్ హల్ చల్ చేసింది. తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కింది సమంత అయితే ఈ సారి ఎలాంటి కాంట్రవర్సీతో కాదండోయ్. సాధారణంగా హీరో, హీరోయిన్లు తమ ఫిట్ నెస్ కోసం యోగా, జిమ్ములకు వెళ్తుంటారు..ఈ అమ్మడు కూడా ఫిట్ నెస్ కోసం జిమ్ముకి వెళ్తుంది.

సమంత


అయితే అక్కడ సమంత చేసిన ఫీట్స్ చూస్తే అందరూ ముక్కున వేలు వేసుకున్నారు. ఇరవై కాదు ముప్పయి కాదు ఏకంగా వంద కేజీలు ఉన్న వెయిట్ లిఫ్ట్ ని మూడు సార్లు ఎత్తి ఔరా అనిపించింది. మామూలుగా వంద కేజీల బరువు ఎత్తడానికి మగవాళ్ళే ఆపసోపాలు పడతారు అలాంటిది సమంత ఎంతో వీజీగా ఎత్తి తన స్టామినా ఏంటో చూపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: