నిజ జీవిత స్టోరీలను ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన మేకర్స్ సినిమా రూపంలో తెరకెక్కిస్తారు. ఆ విధంగా ఓ వ్యక్తి నిజజీవితానికి తెర రూపం క్రియేట్ చేసి….ఆ డైరెక్టర్స్ మరింత పాపులర్ అవుతారు. అయితే వారు ఎంచుకునే సబ్జెట్స్ అన్నీ యూనివర్సల్ సబ్జెట్ అయి ఉంటాయి. ప్రతి ఒక్కరు ఆ వ్యక్తి యొక్క జీవిత చరిత్రని సినిమా ద్వారా చూడాలనే ఆసక్తిని కలిగిఉన్న వారుగా ఉంటారు. అటువంటి సందర్భంలో డైరెక్టర్స్ తెరకెక్కించే జీవిత చరిత్రలకు ప్రేక్షకుల్లో మంచి డిమాండ్ ఉంటుంది.

అయితే జీవిత చరిత్రలను తెరకెక్కించే డైరెక్టర్స్ లో రెండు రకాల వర్గాలు ఉంటాయి. ఒకటి కాంట్రవర్సీ లేకుండా తెరకెక్కించే వారు…రెండోది కాంట్రవర్సీ ఉన్నప్పటీకి వాటిని పట్టించుకోకుండా తెరకెక్కించే వారు. ఆ రెండో వర్గాని చెందిన వారే రామ్ గోపాల్ వర్మ. ‘శివ’ నుండి  నేటి ‘వంగవీటి’ సినిమా వరకూ వర్మ చేసిన సినిమాలు అన్నీ ఎంతో ప్రత్యేకమైనవి. ముఖ్యంగా క్రైమ్ జోనర్ లో తను చేసే చిత్రాలకి ఇప్పటికీ బాక్సాపీస్ వద్ద మంచి డిమాండ్ ఉంది.

అయితే ఈ మధ్య కాలంలో వర్మ తెలుగు నేలపై మిస్టరీగా మారిన రక్త చరిత్ర కథలను తన మూవీలకి కథాంశాలుగా ఎంచుకుంటున్నాడు. గతంలో పరిటాల రవి హత్య నేపథ్యంలో కథని తెరకెక్కించి సంచలనాన్ని క్రియేట్ చేశాడు. ఇప్పుడు వంగవీటి అంటూ బెజవాడ నేపథ్యంలో మరో సంచలనం క్రియేట్ చేస్తున్నాడు. అయితే వంగవీటి సినిమాని చేయద్దు.. ఆపేయమని తనకి చాలా మంది నుండి వార్నింగ్ లు కూడ వచ్చాయంట. అయితే వర్మ మాత్రం ఆగేది లేదని అంటున్నాడు.

దీంతో ప్రత్యర్ధి వర్గం వర్మ మూవీని రిలీజ్ చేసే సమయంలో, ఆ మూవీని ఇరకాటంలో పెట్టేందుకు సరైన స్పాట్ ని ఫిక్స్ చేశారు. అంతే కాకుండా వ్యక్తిగత జీవితంలో జరిగిన విషయాలను కథలుగా తెరకెక్కించే రైట్స్ వర్మకి లేవు అంటూ కొందరు కొత్తగా గొంతు ఎత్తుతున్నారు.  ఈ మూవీ నిలుపుదలపై కొందరు కోర్టు నుండి సైతం స్టై తీసుకురావటానికి ప్రయత్నాలు చేస్తున్నారంట. 


మరింత సమాచారం తెలుసుకోండి: