టాలీవుడ్ సినిమా రంగంలో ఎందరో సెలెబ్రెటీలు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్నవారిలో మటుకు మహేష్ నమ్రతల జంట చూడముచ్చటగా ఉంటుంది. ఫిబ్రవరి 10వ తారీఖున నమ్రతా మహేష్ లు తమ 11వ మ్యారేజ్ యానివర్సరీని జరుపుకున్నారు. ఈ సందర్భంగా నమ్రత పెట్టిన ఒక ట్విట్ చాల భావయుక్తంగా అనిపించింది.

‘గొప్ప పెళ్లిళ్లు అదృష్టంతోనో అనుకోకుండానో జరగవు. కొంత నిర్దిష్టమై సమయాన్ని ఆలోచనను దయా గుణాన్ని అనుబంధాన్ని భక్తి భావాన్ని పరస్పర గౌరవాన్ని భార్యా భర్తల మధ్య చెదిరిపోని కమిట్మెంట్ ని పెట్టుబడిగా పెట్టినప్పుడు మాత్రమే గొప్ప పెళ్ళిళ్ళుగా మారతాయి’ అంటూ నమ్రత ట్విట్ చేసి ‘మీ అందరి  ప్రేమకు ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు’ అంటూ తన ట్వీట్ ను ముగించింది నమ్రత.

2005 ఫిబ్రవరి 10న మహేష్ ను నమ్రత శిరోద్కర్ పెళ్లి చేసుకున్నా అంతక ముందే ఎన్నో సంవత్సరాలుగా వారిద్దరు ప్రేమించుకుని డేటింగ్  చేసిన విషయం తెలిసిందే. అయితే ఈపెళ్ళికి మహేష్ తన తండ్రి కృష్ణను ఒప్పించడానికి చాల కష్ట పడ్డాడు అన్న వార్తలు అప్పట్లోనే వచ్చాయి. అంత కష్టపడి పెళ్ళి చేసుకున్నాక మహేష్ సినిమాలకు వరస పరాజయాలు వచ్చినా వాటి అన్నింటిని తట్టుకుని నిలబడ్డారు వీరిద్దరూ. 

ప్రస్తుతం టాలీవుడ్ బెస్ట్ కపుల్ గా గుర్తింపు ఉన్న వీరిద్దరి 11వ పెళ్ళి వార్శికోతవం సందర్భంగా నమ్రత చేసిన ట్విట్ ఆ భార్యాభర్తల అనుబంధాన్ని సూచిస్తోంది. అయితే పెళ్ళికి నమ్రత ఇచ్చిన భావయుక్తమైన ఆ ఇచ్చిన డెఫినిషన్ మహేష్ అభిమానులకు పూర్తిగా అర్ధం అవుతుందా ? అన్నదే ప్రశ్న..

మరింత సమాచారం తెలుసుకోండి: