అందాల రాక్షసి ఫేం హను రాఘవపూడి లక్ తలుపు తట్టింది.. నాని వీర ప్రేమ గాథని అద్భుతంగా చూపించిన ఈ దర్శకుడికి మరో బిగ్ ఆఫర్ దక్కిందని తెలుస్తుంది. దగ్గుబాటి యువ హీరో రానా హీరోగా 'కవచం' అనే సినిమా ఉంటుందని టాక్. అయితే ఈ సినిమా ఇప్పుడు అనుకున్నది కాదు.. సంవత్సరమ్నర ముందు అనుకున్నదే కాని అప్పట్లో అది కుదరలేదు.  


అంతేకాదు బాహుబలి సినిమా కోసం రానా కూడా తన డేట్స్ అన్ని ఇచ్చేశాడు.. కవచం అనే టైటిల్ కూడా పెట్టుకున్న ఈ సినిమా సురేష ప్రొడక్షన్ బ్యానర్లో సురేష్ బాబు నిర్మించనున్నారు. అయితే ఈ సినిమా మళ్లీ తెర మీదకు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారట. కృష్ణగాడు సక్సెస్ చూసి సిని పరిశ్రమలోని వారు కూడా హను టాలెంట్ ను మెచ్చుకుంటున్నారు.


సినిమా మొదటి షో నుండి సూపర్ హిట్ టాక్ వచ్చేసింది.. నాని కెరియర్లో ఈ సినిమా మరో భలే భలే మగాడివోయ్ అవుతుందనడంలో సందేహం లేదనిపిస్తుంది. ఎప్పటిలానే నాని నటన ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం హను హిట్ ట్రాక్ ఎక్కాడు కాబట్టి ఆ దర్శకుడితో సినిమా చేసేందుకు క్యూ కడుతున్నారు నిర్మాతలు. అయితే అటకెక్కిన రానా కవచం సినిమాను మళ్లీ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట. 


కథ..కథనాల్లో కొత్తదనం చూపిస్తున్న హను సినిమా సక్సెస్ ను ముందే నమ్మకంతో చెప్పడం కూడా అతని టాలెంట్ కు ఒక మార్క్ లా కనిపిస్తుంది. ప్రస్తుతం చాలామంది దర్శకులు పరిశ్రమకు పరిచయం అవుతున్నా ఎవరికి వారు తమ ప్రత్యేకమైన టాలెంట్ ను ప్రేక్షకులకు చూపించే ప్రయత్నంలో ఉన్నారు. మరి హను, రానాల కలయికలో వచ్చే కవచం ఇంకెన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: