అందాల రాక్షసి సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయిన హను రాఘవాపూడి ప్రశంసలు కూడా అందుకున్నాడు. కానీ కమర్షియల్ గా బ్యాడ్ గా జరిగింది ఆ సినిమా. కానీ తన ముద్రని మాత్రం వెయ్యడం లో సూపర్ సక్సెస్ అయ్యాడు ఈ డైరెక్టర్. మొదటి సినిమా విడుదల అయిన మూడు సంవత్సరాల గ్యాప్ తరవాత నిన్ననే కృష్ణ గాడి వీర ప్రేమ గాథ విడుదల అయ్యింది అతనిది. ఈ సినిమా ప్రస్తుతం మంచి టాక్ తో నడుస్తోంది.

 

 

 

 హిట్ టాక్ తో కొత్తదనం ఇచ్చిన డైరెక్టర్ గా ఇప్పుడు హను పేరు అందరూ వాడుతున్నారు. కొత్తదనానికి కొత్తదనం ఇస్తూనే కావలసిన కమర్షియల్ అంశాలు జోడించాడు హను. కమర్షియల్ గా వర్క్ అయ్యే సినిమాలు తాను కూడా తీయగలను అని ప్రూవ్ చేసుకున్నాడు ఈ దెబ్బతో. ఇప్పటికే అతను హీరో రానా కి 'కవచం' కథ చెప్పాడు. ఆ సినిమా రానా వాళ్ళ నాన్న సురేష్ బాబు తన సొంత బ్యానర్ లో నిర్మించాల్సి ఉంది కానీ రానా బాహుబలి గొడవల్లో బిజీ ఉండి కాల్ షీట్ లు ఆ సినిమా చెయ్యలేదు.

 

 

ఇప్పుడు 'కవచం' అనే టైటిల్ పెట్టబడ్డ ఆ సినిమా మళ్ళీ ట్రాక్ మీదకి వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. మనకి అందుతున్న సమాచారం ప్రకారం నిన్ననే 'కృష్ణ గాడి వీర ప్రేమ గాథ' సినిమా చూసిన రానా స్వయంగా హనూ కి కాల్ చేసి మరీ మెచ్చుకున్నాడట. త్వరలో తాము ఒకసారి కలవాలి అని కూడా కోరాడట. కవచం కథ మీద దాదాపు ఏడాదిన్నర పనిచేసినా అది రిజెక్ట్ చేసాడు రానా సో ఇప్పుడు ఆ సినిమా పట్టాలు ఎక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: