ఇప్పటి వరకూ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సాప్ట్ రోల్స్ చేసుకుంటూ వచ్చాడు హీరో ఆది. ‘ప్రేమ కావాలి’, ‘లవ్లీ’సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఈ యంగ్ హీరో, రీసెంట్ గా వచ్చిన గరం మూవీతో ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయాడని అంటున్నారు. పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ‘గరం’ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయిందని అంటున్నారు. సాయికుమార్ సొంత నిర్మాణంలో, మదన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పై ఆది భారీ అంచనాలు పెట్టుకున్నాడు.

ఈమూవీ కోసం ఆది ఎన్నో జాగ్రత్తలను తీసుకున్నాడు. కానీ కథా పరంగా అంతగా లేకపోవటంతో ఈ మూవీపై థియోటర్స్ వద్ద డివైడ్ టాక్ వచ్చింది. ‘గరం’ అనే టైటిల్ లోనే మాస్ లుకింగ్ గా ఆది కనిపించటాని బాగా ప్రయత్నం చేశాడు. అలాగే మొదటగా గరం సినిమాని డైరెక్టర్ బాగా ఆసక్తిగా స్టార్ట్ చేసినప్పటికీ, తరువాత మాత్రం వీక్ గా మారింది. మొదటి అరగంట మాత్రమే సినిమాని చక్కగా చూపిన దర్శకుడు తరువాత మాత్రం రొటీన్ చిత్రాలుగా తెరకెక్కించాడు.

ఎప్పుడూ ఆది మూవీలో కామెడీ అనేది సక్సెస్ గా నిలుస్తుంది. కానీ ఈ మూవీలో మాత్రం పికె ఫ్లేవర్ లో బ్రహ్మానందంతో వచ్చిన కామెడీ ఎపిసోడ్, ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఇది మూవీకి పెద్ద మైనస్ గా మారింది. అయితే ఈ మూవీలో విశేషం ఏమిటంటే ఇప్పటి వరకూ ఆది క్లాస్ సినిమాలలోనే చేశాడు. అయితే డైరెక్టర్ మదన్ సైతం క్లాస్ సినిమాలనే తెరకెక్కించాడు. వీరిద్దరూ కలిసి ఒక్క సారిగా మాస్ సినిమాలోకి రావటంతో డైరెక్టర్ ఈ సబ్జెట్ ని సరిగా హ్యాండిల్ చేయలేకపోయాడు.

అలాగే ఇటువంటి మాస్ సబ్జెట్ ని హీరో సెలక్ట్ చేసుకోవటం తను చేసిన తప్పు అని అంటున్నారు. మొత్తంగా ఆది, గరం మూవీ విషయంలో ఇలాంటి మాస్ కథని సెలక్ట్ చేసుకోకపోకుండా ఉండే మంచిదని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: