వర్మ తెరకెక్కిస్తున్న కథలో వంగవీటి సినిమా ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. వంగవీటి కథ బెజవాడ నేపథ్యం చుట్టు తిరుగుతుంది. అయితే వంగవీటి రాధా, రంగా హత్యలు బెజవాడ చరిత్రనే మార్చివేశాయి. అందుకే ఇంతటి పవర్ఫుల్ కథలో పాత్ర ధారులుగా ఎవరు నటిస్తున్నారు అన్న దానిపై ఇండస్ట్రీలో హాట్ హాట్ టాక్స్ నడుస్తున్నాయి. అయితే తాజాగా వంగవీటి కథలో ఓ కీలక పాత్ర జాయిన్ అవుతుందని అంటున్నారు.


అదే పరిటాల రవి పాత్ర. తెలుగు దేశం పార్టీలో పరిటాల రవి క్రీయాశీల బాధ్యతలను వహించాడని తెలుసు. అయితే వర్మ గతంలో పరిటాల రవి బయోగ్రఫిని తెరకెక్కంచే సమయంలో ఈ పాత్ర కోసం ప్రముఖ యాక్టర్ వివేక్ ఒబెరాయ్ ని తీసుకున్నాడు. వివేక్ ఒబెరాయ్, పరిటాల రవి పాత్రలో కరెక్ట్ గా సరిపోయాడు. ఇప్పుడు వంగవీటి కథలో పరిటాల రవి పాత్రకు వర్మ చోటు కల్పించటం ప్రాముఖ్యతని సంతరించుకుంది.


అయితే వంగవీటి కథలో ఉన్న పాత్రల వివరాలను వర్మ బయటకు చెప్పినప్పటికీ, ఇందులో రవి పేరు ప్రస్థావించలేదు. కానీ సినిమా రూపంలో వచ్చేసరికి పరిటాల రవిని సైతం ఇందులో చూపించనున్నాడని తెలుస్తుంది. ఇందుకోసం వర్మ మళ్ళీ వివేక్ ఒబెరాయ్ ని కలిసి వంగవీటి కథలో రవి పాత్రను పోషించాలని కోరాడంట. అందుకే రీసెంట్ గా వర్మ ముంబాయ్ లోని వివేక్ ఒబెరాయ్ ని కలిసాడని అంటున్నారు.


ఈ పాత్రపై స్పష్టమైన వార్తలు మాత్రం రావటం లేదు. కానీ వంగవీటి టీం నుండి వినిపిస్తున్న సమాచారం మేరకు…వివేక్ ఒబెరాయ్ ఇందులో నటిస్తున్నాడని అనే వార్తలు మాత్రం ఇండస్ట్రీలో చక్కెర్లు కొడుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: