2016 సమ్మర్ ని తెలుగు సినిమా హీరోలు ఇంకా వేడి ఎక్కించబోతున్నారు. ఓవెన్ లో ఫుల్ హీట్ పెట్టినట్టుగా ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ బాగా వేడెక్కి పిచ్చెక్కించ బోతోంది. టాలీవుడ్ సినిమా కి సంబంధించి ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగొందల కోట్ల మేర బిజినెస్ జరిగే సూచనలు కనపడుతున్నాయి. అన్ని కొట్లంటే ఒచ్చేవి చిన్నా చితకా సినిమాలు కాదన్న సంగతి అర్ధం అవుతోంది .

 

 ఈ వేసవి లో పవర్ స్టార్ , సూపర్ స్టార్ లు దగ్గర దగ్గర గ్యాప్ తో రాబోతూ ఉండడం కూడా పెద్ద విశేషం. తెలుగు సినిమా ప్రియులకి ఈ సమ్మర్ మంచి సమ్మగా ఉండబోతోంది అని తెలుశ్తోంది. రెండు వారాలకి ఒక పెద్ద సినిమా యావరేజ్ గా థియేటర్ తలుపు తట్ట బోతున్నాయి. రాబోయే వేసవి లో ఎన్ని సినిమాలు అంచనాలు మించుతాయో మరిన్ని సినిమాలు డిస్ట్రిబ్యూటర్ లని ముంచుతాయో తెలీదు కానీ బిజినెస్ మాత్రం విపరీతంగా సాగుతుంది. అత్తారింటికి దారేది తరవాత అసలు ఎక్కడా సోలో సినిమా తో దర్సనం ఇవ్వని పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవర్ ఫుల్ గా 'సర్దార్ గబ్బర్ సింగ్' తో రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి భారీ బిజినెస్ నడుస్తోంది.

 

 శ్రీమంతుడు తో బాహుబలి తప్ప అన్ని రికార్డులూ కొట్టేసిన మహేష్ బాబు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రహ్మోత్సవం తో బ్రహ్మరథం పట్టే పనిలో పడ్డాడు. వీరిద్దరూ కాక అల్లూ అర్జున్ మరొక యాభై కోట్ల సినిమా కొట్టడం కోసం సిద్దం అయ్యాడు. ఇదే వేసవి లో నాగార్జున ఊపిరి కూడా రానుండడం విశేషం. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో కార్తి - నాగార్జున హీరోలు గా రాబోతున్న ఈ సినిమా తేలికగా ముప్పై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసేస్తుంది. మరొక పక్క విక్టరీ వెంకటేష్ - మారుతి ల సినిమా బాబు బంగారం రాబోతోంది.

  

మంచి ఫార్మ్ లో ఉన్న మారుతి సినిమా బయ్యర్లు ఎగబడి మరీ కొంటారు. త్రివిక్రమ్ సినిమా ఈ పాటికి విడుదల అవ్వాల్సి ఉన్నా అది సమ్మర్ కే ఒచ్చేలా కనిపిస్తోంది. సో త్రివిక్రమ్ సినిమా అంటే బిజినెస్ అరాచకమే ఒక ముప్పై కోట్ల లెక్క వేసుకోవచ్చు. మరొక పక్క రొమాంటిక్ సినిమా మజ్నూ - మలయాళం ప్రేమం రీమేక్ . ' సుప్రీం ' మెగా హీరో సాయి ధరం తేజ సినిమా ఇలా బోలెడు సినిమాలు ఉన్నాయి. సో మొత్తం కలిపి వేసవి లో ఒక నాలుగొందల కోట్ల మేర బిజినెస్ చేసేస్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: