ఒక హీరోను దృష్టిలో పెట్టుకుని ఒక దర్శకుడు ఒక కధను తయారు చేస్తే ఆహీరోకి ఆదర్శకుడు చెప్పిన కథ నచ్చనప్పుడు మరో హీరోకు ఆ కథ చెప్పి ఒప్పించి తీసిన సంఘటనలు మన టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎన్నో జరిగాయి. ఇలా ఒక హీరో తిరస్కరించిన కథలో మరో హీరో చేసిన సినిమాలు సూపర్ హిట్ అయిన సందర్బాలు కూడ ఉన్నాయి. ఇప్పుడు అదే సెంటిమెంట్ ను నమ్ముకుంటున్నాడు సునీల్.

ఈ వారం విడుదల కాబోతున్న ‘కృష్ణాష్టమి’ సినిమా కథను దర్శకుడు వాసు వర్మ అల్లుఅర్జున్ ను దృష్టిలో పెట్టుకుని వ్రాశాడట. అయితే ఈ కథ అల్లుఅర్జున్ కు పెద్దగా నచ్చకపోవడంతో నిర్మాత దిల్ రాజ్ సునీల్ కు ఈకథను సునీల్ కు వినిపించి బన్నీ ఈమూవీ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్న విషయాన్ని బయట పెట్టాడట.

అయితే సునీల్ కు గత సెంటిమెంట్లు గుర్తుకు వచ్చి తనకు కూడ ఒక హీరో తిరస్కరించిన కథ తనకు సూపర్ హిట్ ఇస్తుంది అన్న నమ్మకంతో ఒక్క క్షణం ఆలోచించకుండా ‘కృష్ణాష్టమి’ సినిమాను చేసాను అంటున్నాడు సునీల్.  అయితే బన్నీ కోసం తయారు చేసిన ఈ కథలో చాల మార్పులు చేర్పులు చేసి తనకు తగ్గట్టుగా ఈ సినిమా కథను మార్పు చేసిన విషయాన్ని సునీల్ అసలు విషయాన్ని బయట పెట్టాడు. 

గత రెండు సంవత్సరాలుగా తనకు వచ్చిన గ్యాప్ గురించి మాట్లాడుతూ కొన్ని కమిట్ మెంట్లు తాను తన నిర్మాతలకు ఇచ్చిన నేపధ్యంలో వారు సినిమాలు తీస్తారు అని ఎదురు చూడవలసి వచ్చిన విషయాన్ని తెలుపుతూ ఒక విధంగా తాను తన కెరియర్ పరంగా కొన్ని తప్పులు చేసాను అని అంటున్నాడు సునీల్. ఈమధ్య కాలంలో చాల సినిమాలు ఊహించని విజయాలు అందుకుంటున్న నేపధ్యంలో సునీల్ కెరియర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన ఈ ‘కృష్ణాష్టమి’ కూడ హిట్  కొట్టకపోతే  సునీల్ కెరియర్ మరింత సమస్యలలోకి వెళ్ళి పోతుంది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు..

మరింత సమాచారం తెలుసుకోండి: