సినిమా ఇండస్ట్రీలో అంటే రంగుల ప్రపంచ..స్వర్గంలా ఉంటుంది..ఒక్కసారి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చామంటే దశతిరిగినట్లే అని అనుకుంటారు. అయితే ఎంత సినీ ప్రపంచమైనా వారికీ కొన్ని కష్టాలు ఉంటాయి..అది మానసికమే కావచ్చు..శారీరకమే కావచ్చు. గతంలో హీరోలు ఫైట్ సీన్లు చేయాంటే డూప్ లు వాడేవారు..కానీ ఈ మద్య డూప్ లేకుండా యాక్షన్ సీన్లలో నటించి బాగా దెబ్బలు తగిలించుకుంటున్నారు హీరోలు.

తాజాగా షూటింగ్ లో ఓ నటి తీవ్రగాయాలపాలయ్యింది. ఆ హీరోయిన్ కి గాయాలు అయి తొడ భాగం మొత్తం రక్తసిక్తం కావడంతో షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు హాలీవుడ్ చిత్ర యూనిట్ . త్రిప్లెక్స్ సూపర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్ గా రూపొందుతోన్న చిత్రంలో హాలీవుడ్ భామ ''నైనా దో బ్రేవ్ '' నటిస్తోంది. యాక్షన్ సన్నివేశం  చిత్రీకరిస్తున్న సమయంలో నైనా తొడ భాగంలో గాయాలు అయ్యాయి.

''నైనా దో బ్రేవ్ ''


రక్తస్రావం కూడా జరగడంతో వెంటనే షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి నైనా ని ఆసుపత్రికి తరలించారు. 27 ఏళ్ల నైనా దో బ్రేవ్  యాక్షన్ చిత్రాలంటే ఇష్టమని గాయాలు అయినంత మాత్రాన భయపడేది లేదని అంటోంది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: