సినిమా ప్రపంచం రోజు రోజు కీ ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పడు మొత్తం డిజిటల్ టెక్నాలజీ..లేనిది ఉన్నట్లుగా..ఉన్నది లేనట్లుగా మాయా ప్రపంచాన్నే సృష్టిస్తున్నారు. అయితే ఒకప్పుడు ఇలాంటి టెక్నాలజీ ఏవీ లేకున్నా ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసిన చిత్రం ‘జేమ్స్ బాండ్’.  మాఫియా ను ఎదిరించే సమయంలో ఎన్నో సాహసకృత్యాలు చేస్తూ చివరికి తన దేశం గర్వించ దగ్గ సీక్రెట్ ఏజెంట్ పేరు జేమ్స్ బాండ్.

జేమ్స్ బాండ్ పోస్టర్


ఇప్పటికే ఈ చిత్రాలకు సంబంధించి ఎన్నో సీక్వెల్స్ వచ్చాయి. హాలీవుడ్ మూవీ జేమ్స్‌బాండ్ దర్శకుడు గాయ్ హామిల్టన్(94) కన్నుమూశారు. స్పెయిన్‌లోని మలోర్కలో ఆయన తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు తొంభై నాలుగు సంవత్సరాలు, జేమ్స్ బాండ్ హారోగా పేరొందిన అద్భుత చిత్రాలు తీశారు.


 సీన్ కానరదీతో గోల్డ్ ఫింగర్, డైమండ్స్ ఆర్ ఫరెవర్, వంటి సినిమాలను రోజుర్ మూర్ తో కలిసి లివ్ అండ్ లెట్ డై ద మాన్ విత్ గోల్డెన్ గన్ వంటి సినిమాలను ఆయన తెరకెక్కించారు. అదేవిధంగా బాండ్ సినిమాలతో పాటు పలు బ్రిటిష్ చిత్రాలకు హామిల్టన్ దర్శకత్వం వహించారు. హామిల్టన్ మరణంపై రోజుర్ మూర్ సంతాపం తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: