పార్న్ స్టార్ నుండి సిని స్టార్ గా మారిన సన్ని తాను బాలీవుడ్ లో అడుగుపెట్టిన వేళావిశేషం మంచిది కాబట్టి తాను ఈ రేంజ్ పాపులారిటీ సంపాదించింది. మొదటి సినిమా మొదలు సన్ని లియోన్ చేస్తున్న సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబడుతున్నాయి. అయితే తాను ఓ పార్న్ స్టార్ అన్న ఆలోచన గుర్తు వచ్చినప్పుడల్లా ఆ పరిస్థితులు తలచుకునే సన్ని ఇప్పుడు తాను బూతు కథలతో 'స్వీట్ డ్రీమ్'స్ అంటూ 12 బెడ్ టైం స్టోరీస్ రాస్తుంది.  


ఎరోటిక్ పిక్షన్ గా వస్తున్న ఈ కథలను సన్ని స్వయంగా తన అనుభూతులను పంచుకుంటుంది. ఇక ఈ కథలను జాగర్ నట్ సంస్థ ప్రచురిస్తుంది. సన్ని సినిమాలే హాట్ హాట్ గా ఉంటాయ్ ఇక సన్ని రాసిన కథలెలా ఉంటాయో మనం అర్ధం చేసుకోవచ్చు. ఈ కథలన్ని జాగర్ నట్ ఆప్ ద్వారా చదవొచ్చు. ఇక ఆమె రాసిన తొలి కథ శనివారం ప్రచురించడం జరిగిందట. 


షారుఖ్ ఖాన్ తో సన్నీ లియోన్ :


తనను కథలు రాయమని జాగర్ నట్ కోరడంతో మూడు నెలల వ్యవధిలో 12 కథలను రాశానని.. ఇండియన్ ట్రెడిషన్ తోనే ఈ కథలుంటాయని చెబుతున్న సన్ని సెక్స్ లో మగవాళ్లు, ఆడవాళ్లు సమాన భాగస్వామ్య కావాలనే ఉద్దేశంతో ఈ కథలను రాస్తున్నట్టు చెబుతుంది. మరి ఈ ప్రోగ్రాం ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. 


ప్రస్తుతం సన్ని ఫుల్ ఫాంలో ఉంది. తనతో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు కూడా పోటీ పడుతున్నారు. ఈ మధ్యే కింగ్ ఖాన్ షారుఖ్ రాయీస్ సినిమాలో సన్నితో కలిసి స్టెప్పులేశాడు షారుఖ్. ఆ అనుభవాలను కూడా చెబుతూ షారుఖ్ తో పనిచేయడం ఓ గొప్ప థ్రిల్ అని అంటుంది సన్ని.  


మరింత సమాచారం తెలుసుకోండి: