విలక్షణ నటుడు బ్రహ్మాజీ ఒక ప్రముఖ తెలుగు దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ జూనియర్ ల నిగూఢ శక్తుల పై ఆసక్తికర కామెంట్స్ చేసాడు. పవన్ ఎదుటి మనుషులను వారి మనస్తత్వాన్ని ఇట్టే పసిగట్టగల సమర్దతగల వ్యక్తి అని కామెంట్ చేస్తూ ఎదుటి మనుషుల ముఖం చూసి వారు ఏమిటో చెప్పే విషయంలో పవన్ చాల ప్రాక్టీస్ చేసాడని అంటూ పవన్ లోని మరోకోణాన్ని బయట పెట్టాడు బ్రహ్మాజీ.

అంతేకాదు పవన్ కళ్యాణ్ తో తాను చాల సన్నిహితంగా ఉంటానని చెపుతూ తన సమస్యలను పవన్ తో షేర్ చేసుకున్నప్పుడు పవన్ వాటికి ఎన్నో పరిష్కారాలు చూపిన వ్యక్తి అని పవన్ తో తన సాన్నిహిత్యాన్ని బయట పెట్టాడు బ్రహ్మాజీ. అంతేకాదు 2017కు నటుడుగా తాను వేరే రేంజ్ లో ఉంటానని రచయితలు దర్శకులు తనను దృష్టిలో పెట్టుకుని కేరక్టర్లు వ్రాస్తారని పవన్ చెప్పిన విషయాన్ని కూడ లీక్ చేసాడు బ్రహ్మాజీ.

ఇక జూనియర్ ఎన్టీఆర్ తో తన సాన్నిహిత్యం గురించి వివరిస్తూ హీరోలలో చాలామంది కంటే చాల చిన్న వాడైన జూనియర్ మహా మేధావి అంటూ అతడు ఒక ‘గూగుల్’ లాంటి వాడు అంటూ జూనియర్ లోని అపరిమిత తెలివి తేటలను బయట పెట్టాడు బ్రహ్మాజీ. ఇక సీనియర్ హీరో వెంకటేష్ ఫిలాసఫీ గురించి మాట్లాడుతూ నేటితరం టాప్ హీరోలు అంత సరైన కథ దొరకలేదని కాసేపు ఆ తరువాత కథ దొరికాక రిస్క్ చేస్తున్నామా అని బాధపడుతూ రోజులు గడుపుతున్నారు తప్ప వాస్తవానికి ఏ టాప్ హీరో ఆనందంగా లేడు అని తనతో అన్న విషయాన్ని బయట పెట్టాడు బ్రహ్మాజీ.

ఇలా టాప్ సినిమా హీరోల గురించి ఎన్నో ఆ శక్తికర విషయాలను బయట పెట్టిన బ్రహ్మాజీ ఈమధ్యన తాను భౌద్ధ మతంలో మారిన విషయాన్ని కూడ అందర్నీ ఆశ్చర్య పరుస్తూ బయట పెట్టాడు. ప్రతి మనిషికీ ఎదగాలన్న కోరిక ఉన్నా మనకు గత జన్మలో ఎంత ఉంటే అంతే డ్రా చేసుకోగలం అని అంటూ తనలోని వేదాంత ధోరణిని ఈ భౌద్ధ మతం మరింత పెంచింది అని అంటూ ఎన్నో ఆ శక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు బ్రహ్మాజీ..



మరింత సమాచారం తెలుసుకోండి: